Prabhas : సినిమాల్లో హీరోలు చేసే పోరాట సన్నివేశాలు అన్నీ నిజం కావు, చాలావరకు డూప్ ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే హీరోలు రిస్కీ స్తంట్స్ చెయ్యలేక కాదు, ఆ చేసే క్రమం లో వాళ్లకు ఏదైనా గాయం అయితే నెలల తరబడి షూటింగ్ ఆగిపోతుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో గతం లో జరిగాయి.
ఉదాహరణకి #RRR మూవీ షూటింగ్ సమయం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి, దీంతో ఇద్దరు హీరోలు నెలల తరబడి విశ్రాంతి తీసుకోవడంతో సినిమా షూటింగ్ దాదాపుగా ఏడాది పాటు ఆగిపోయింది. ఇకపోతే ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈయన మీద వేల కోట్లు బడ్జెట్స్ ని పెడుతూ ఉంటారు నిర్మాతలు. షూటింగ్ సమయాల్లో ఏ చిన్న గాయం జరిగిన నిర్మాతలు మొత్తం నష్టపోయినట్టే. అందుకే ఈమధ్య ఎక్కువగా ఆయన డూప్స్ ని వాడుతూ ఉన్నారు.
‘ఎనిమల్’ చిత్రం మీ అందరూ చూసే ఉంటారు, అందులో బాడీ డబుల్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సరిగ్గా అదే ఫార్ములా ని ప్రభాస్ సినిమాలకు కూడా వాడుతున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ డూప్ ఆర్టిస్టుతో ఎక్కువ పని ఉండడం తో, అతను కూడా ప్రభాస్ సినిమాలకు భారీగానే డిమాండ్ చేస్తున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం కేవలం ఒక్క రోజు షూటింగ్ కి ఆయన 30 లక్షల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడట.
ప్రభాస్ సినిమాలకు దాదాపుగా నెల రోజుల పని ఈ డూప్ ఆర్టిస్టుతో ఉండడం తో నెలరోజులకు కలిపి 9 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. మరి ప్రభాస్ ఒక్కో సినిమాకి 125 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, ఆయన డూప్ కి ఆ మాత్రం డిమాండ్ ఉండదా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.