Radhika Apte : హీరోల మూడ్‌ను బట్టి పని.. ఆ ఇండట్రీని అస్సలు భరించలేం..

- Advertisement -

Radhika Apte : బాలీవుడ్ నటి రాధికా ఆప్టే గతంలో తెలుగు చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలతో వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. గతంలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరో తనను ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్యానించి పెద్ద రచ్చ చేశారు. తెలుగు ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడిన ఆమె ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా రాధిక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమపై దుష్ప్రచారం చేసేందుకు ఇతర సినీ పరిశ్రమ అభిమానులు ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు.

ఆ వీడియోలో రాధిక ఏమన్నారంటే… “నేను కష్టపడిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది తెలుగు చిత్ర పరిశ్రమనే. ఇండస్ట్రీ లో పురుషుల ఆధిపత్యం ఎక్కువ. మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు నిజంగా భరించలేనిది. సినిమాల్లో కూడా హీరోని దేవుడిలాగా చూడడం వరకే వారి పాత్ర పరిమితమవుతుంది. సెట్స్‌లో హీరోయిన్లను కూడా సరిగ్గా ట్రీట్ చేయరు. హీరోలను ఎవరూ ఏమీ అడగరు.

అంతేకాదు హీరోల మూడ్‌కి తగ్గట్టుగానే అందరూ ప్రవర్తిస్తారు. అందుకే అక్కడ ప‌నిచేయ‌డానికి చాలా కష్టపడ్డాను. అందుకే అక్కడ పనిచేయడం మానేశాను’’ అన్నారు. దీంతో రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్ కావడంతో తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో హాయిగా ఉంటూ హ్యాపీగా సినిమాలు చేసే నటీమణులు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారని, అయితే రాధికా ఆప్టే మాత్రం పబ్లిసిటీ కోసమే తాను చేయగలిగినదంతా చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

అయితే రాధికా ఆప్టే కేవలం తన అనుభవం గురించి మాట్లాడుతున్నార‌ని, అందులో తప్పేమీ లేదని కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. రాధికా ఆప్టే రక్త చరిత్ర 1&2, ధోని, లెజెండ్, లయన్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. మరి ఈ వివాదం ఎక్కడకు ముగుస్తుందో వేచి చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here