Actor Nani : టాలీవుడ్ అందం , డ్యాన్స్ , నటన మూడు సమపాళ్లలో కలిగి ఉన్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఈమెకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోయిన్స్ ఎవరికీ లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఒప్పుకునే రకం కాదు సాయి పల్లవి.
కేవలం నటన ప్రాధాన్యత ఉంటేనే ఆమె ఏ క్యారక్టర్ అయినా చేస్తుంది, లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆమె పట్టించుకోదు. గతం లో ఆమె చిరంజీవి సినిమాని కూడా ఇలాగే వదిలేసుకుంది. ఇకపోతే సాయి పల్లవి కి ఇండస్ట్రీ లో స్నేహితులు కూడా చాలా తక్కువ. కేవలం ఒకరిద్దరితో మాత్రమే ఆమె చాలా సన్నిహితం ఉంటుంది. ఆ ఒకరిద్దరిలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని.
నాని తో కలిసి ఈమె రెండు MCA , శ్యామ్ సింగ రాయ్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుదల సమయం లో అప్పట్లో వీళ్లిద్దరు ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొనే వారు. ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి పెళ్లి గురించి నాని కొన్ని కామెంట్స్ చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘సాయి పల్లవి కి పెళ్లి అయిపోయింది’ అని అంటాడు. ఇంకా ఫీల్ తో ప్రోమో కోసం చెప్తాను అని మరింత ఫీల్ తో ఆమెకి పెళ్లి అయిపోయింది అని చెప్తాడు. అప్పుడు సాయి పల్లవి ‘మా అమ్మ చూస్తే నీకు ఉంటాది.. కచ్చితంగా నీకు ఫోన్ చేస్తాది చూడు’ అని అంటుంది సాయి పల్లవి, దానికి నాని చెయ్యమని ఆంటీ తో నేను మాట్లాడతా అని అంటాడు. అలా వీళ్లిద్దరి మధ్య సరదా చిట్ చాట్ కాసేపు జరుగుతుంది.