Sai Pallavi : స్టార్ హీరో కొడుకుతో జపాన్ మొత్తం తిరుగుతున్న సాయి పల్లవి..ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా!

- Advertisement -

Sai Pallavi : మన టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే పాపులర్ డ్యాన్స్ షో లో ఒక కంటెస్టెంట్ గా ఈమె కెరీర్ మొదలైంది. ఇందులో అద్భుతంగా డ్యాన్స్ చేసి, ఆ సీజన్ టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. అలా వచ్చిన ఫేమ్ తో మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సాయి పల్లవి కి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

ఆమె మొట్టమొదటి చిత్రం ‘ఫిదా’ భారీ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని ‘లేడీ పవర్ స్టార్’ గా నిల్చింది.

కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఇప్పటికే నాగచైతన్య హీరో గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి, బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో గా నటిస్తున్న ఒక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ప్రతిష్టాత్మక యాష్ రాజ్ సంస్థ నిర్మిస్తుంది. అమీర్ ఖాన్ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండవ షెడ్యూల్ ని జపాన్ ని జరుపుకోబోతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఈమధ్యనే సాయి పల్లవి జపాన్ కి పయనమైంది. అక్కడ ఆమె అందమైన ప్రదేశాలను జునైద్ ఖాన్ తో కలిసి చూస్తుందట. ఇలా దేశం కానీ దేశం లో స్టార్ హీరో కొడుకుతో కలిసి చెట్టాపట్టాలేసుకొని సాయి పల్లవి తిరగడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here