Lavanya Tripathi : నా భర్త ఎంత ప్రాధేయపడినా ఆ విషయం లో తగ్గేది లేదు : లావణ్య త్రిపాఠి

- Advertisement -

Lavanya Tripathi : ఇటీవలే ప్రముఖ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. సుమారుగా ఆరేళ్ళ నుండి ప్రేమించుకుంటూ, ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేసుకున్న ఈ జంట ఒక్కటి అవ్వడం తో అభిమానులు ఎంతో సంతోషించారు. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చాయి కానీ, వీడియో మాత్రం ఒక్కటి కూడా రాలేదు.

Lavanya Tripathi
Lavanya Tripathi

గతం లో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సమయం లో నాగ బాబు తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి వీడియో అప్లోడ్ చేసాడు. కానీ వరుణ్ తేజ్, లావణ్య మాత్రం అలా చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ వీడియో ని తమకి గుర్తుగా ప్రైవేట్ గా పెట్టుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. ఇది ఇలా ఉండగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నుండి రీసెంట్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ చేసింది.

Varun tej Lavanya Tripathi

రీసెంట్ గానే డిస్నీ + హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదలకు ముందు లావణ్య త్రిపాఠి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ ఎక్కువగా ‘పెళ్లి తర్వాత సినిమాలు చెయ్యం అనుకున్నాం. కానీ చేస్తున్నారు, ఇంట్లో ఎవ్వరూ అడ్డు చెప్పలేదా’ అనే ప్రశ్న అడిగారు.

- Advertisement -

దీనికి లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘వరుణ్ తేజ్ కానీ, అత్తమ్మ, మామయ్యలు కానీ ఎప్పుడూ కూడా నా స్వేచ్ఛ కి అడ్డు చెప్పలేదు. వరుణ్ తేజ్ కి నా గురించి మొత్తం తెలుసు. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆయన ఆపమని చెప్పడు, నేను కూడా ఆ విషయం లో తగ్గను’ అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here