Lavanya Tripathi : పెళ్లి తర్వాత కెరీర్ ఇలా అవుతుందని అనుకోలేదు.. వరుణ్ తేజ్ అసలు పట్టించుకోవడం లేదు.. : లావణ్య త్రిపాఠి

- Advertisement -

Lavanya Tripathi : ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు లావణ్య త్రిపాఠి. విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సుప్రియ నిర్మించారు. అభిజీత్‌ హీరోగా నటించారు. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘సినిమాల ఎంపికలో నేనెప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తూనే వచ్చా. ఎక్కువ చిత్రాలు చేసేయాలని ఎప్పుడూ ఆరాటపడలేదు. చేసేవి కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి’’ అన్నారు.

Lavanya Tripathi
Lavanya Tripathi

‘‘పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా ఏమీ మారలేదు. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలి అని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదు. కెరీర్‌ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్‌తేజ్‌ రూపంలో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించాడు. ఇంతకంటే ఏం కావాలి. మా వరకు మేమైతే గతంలోలాగే ఉన్నాం. నా ప్రాజెక్ట్స్‌ విషయంలో వరుణ్‌ పెద్దగా కలుగజేసుకోడు. ఎప్పుడైనా నేను ఎంచుకున్న స్క్రిప్ట్‌ గురించి చెబితే వింటాడు.

తను ఈ సిరీస్‌ చూసి చాలా బాగుందని ప్రశంసించాడు. వినోదం.. రొమాంటిక్‌ అంశాలు చక్కగా మిళితమై ఉన్న అందమైన స్క్రిప్ట్‌ ఇది. దీంట్లో రెగ్యులర్‌గా చూసే కామెడీ ఉండదు. పాత్రలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. నేనిందులో లావణ్య, లక్ష్మి అనే రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా. లావణ్య చాలా పర్ఫెక్షనిస్ట్‌. అయితే తనలోని ఆ వ్యక్తిత్వం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

- Advertisement -
Lavanya Tripathi

అవేంటి? వాటి నుంచి తనెలా బయట పడింది అన్నది సిరీస్‌ చూసి తెలుసుకోవాలి.ఈ సిరీస్‌లో చేసిన లావణ్య, లక్ష్మి పాత్రలు నా నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మిలాగే ఉంటా. సెట్లో లావణ్య పాత్రలా పర్ఫెక్షన్‌ కోరుకుంటా. సన్నివేశం బాగా వచ్చే వరకు అడిగి మరి టేక్స్‌ చేస్తుంటా. ఈ సిరీస్‌ను మేము 30రోజుల్లోనే పూర్తి చేశాం. నేను ‘పులి మేక’ సిరీస్‌ చేశాక తమిళంలో ఒక డార్క్‌ థ్రిల్లర్‌ చేశాను. మధ్యలో తెలుగులో ఓ యాక్షన్‌ సినిమా చేశా. ఇలా యాక్షన్‌, థ్రిల్లర్స్‌ తర్వాత ఇలాంటి ఒక రోమ్‌ కామ్‌ చేయడం ఎంతో ఉల్లాసాన్నిచ్చింది’’.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here