Artist Rohan : 90s వెబ్ సిరీస్ లో నటించిన ఈ కుర్రాడి యూట్యూబ్ ఛానల్ నెల సంపాదనతో ఎన్ని కార్లు కొనచ్చో తెలుసా!

- Advertisement -

Artist Rohan : ఇటీవల కాలంలో ఓటీటీ లో విడుదలైన వెబ్ సిరీస్ లలో యూత్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సిరీస్ 90s. బిగ్ బాస్ శివాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ని చూసిన ప్రతీ ఒక్కరు తమ బాల్యం ని నెమరువేసుకున్నారు. శివాజీ కంటే కూడా ఈ సిరీస్ లో నటించిన పిల్లలు బాగా ఫేమస్ అయ్యారు.

Artist Rohan
Artist Rohan

మౌళి, రోహన్ మరియు వాసంతిక ఈ సిరీస్ లో శివాజీ కి పిల్లలుగా నటించారు. వీరిలో రోహన్ పాత్ర అందరికీ తెగ నచ్చేసింది. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇలాంటి కుర్రాడు ఉంటాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా ఈ సిరీస్ లో రోహన్ కి అన్నయ్య గా మౌళి నటించాడు. ఇతన్ని నేరుగా టీవీ సిరీస్ లో చూసిన వాళ్లకు పెద్దగా ఏమి అనిపించదు కానీ, సోషల్ మీడియా లో ఇతనొక పెద్ద సెలబ్రిటీ.

#90's movie

యూట్యూబ్ లో ఇతనికి ‘మౌళి టాక్స్’ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్ లో ఆయన చేసిన వీడియోస్ కి రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేవు. సోషల్ మీడియా లో మీమెర్స్ ప్రతీ సందర్భానికి ఈయన వీడియోస్ ని తెగ వాడేస్తున్నారు. ఆ రేంజ్ కంటెంట్ ఉంది ఇతని యూట్యూబ్ ఛానెల్లో. అలా ప్రతీ వీడియో కి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం తో ఇతని నెల సంపాదన యూట్యూబ్ నుండి 30 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -
Youtuber Rohan

నెలకి 30 లక్షల రూపాయిలు టాలీవుడ్ లో కొంతమంది హీరోస్ కూడా సంపాదించడం లేదు. అలాంటి మౌళి ఇంత చిన్న వయస్సులో సంపాదిస్తున్నాడు అంటే చిన్న విషయం కాదు. అయితే చూసినందుకు ఇతను రోహన్ వయస్సు ఉన్నవాడిలా అనిపిస్తాడు కానీ, ఇతని అసలు వయస్సు 22 ఏళ్లకు పైగానే ఉంటుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here