Mrunal Thakur : నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా కుట్రలు చేస్తుంది వాళ్ళే అంటూ మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Mrunal Thakur : ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో కేవలం ఒకటి రెండు సినిమాలతోనే ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాలో సీత పాత్రతో ఈమె కోట్లాది మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా తర్వాత ఈమెకి బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి కానీ, ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లింది.

Mrunal Thakur
Mrunal Thakur

రీసెంట్ గానే ఆమె న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ హిట్ ని అందుకోవడమే కాకుండా, నటిగా మరో మెట్టు ఎదిగింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఈమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం లో నటిస్తుంది. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Mrunal Thakur News

మృణాల్ ఠాకూర్ కెరీర్ ముందుగా టీవీ సీరియల్స్ ద్వారానే మొదలైంది. బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఆమె, ఆ తర్వాత ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చింది. అలా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో అవకాశాలు సంపాదించిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో పెద్దగా హిట్స్ లేవు, తెలుగు ఆడియన్స్ చూపినంత ఆదరణలో సగం కూడా చూపలేదు బాలీవుడ్ ఆడియన్స్.

- Advertisement -
Mrunal Thakur Updates

అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘బాలీవుడ్ లో నాకు రొమాంటిక్ సినిమాలు చెయ్యాలంటే చాలా ఇష్టం. కానీ నాకు అలాంటి అవకాశాలను ఎవ్వరూ ఇవ్వడం లేదు. బహుశా నేను ఇక్కడ ఫేమస్ కాదని అలా చేస్తున్నారేమో . కొంతమంది దర్శకులు నాతో రొమాంటిక్ సినిమాలు చెయ్యాలని ఆసక్తి చూపించినా కూడా, కొందరు కావాలని అడ్డుపడుతున్నారు’ అంటూ మృణాల్ ఠాకూర్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here