Devara Movie ఇప్పట్లో లేనట్టే.. సోషల్ మీడియా లో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

- Advertisement -

Devara Movie : #RRR చిత్రం తో ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత ఏడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

Devara Movie
Devara Movie

ఏప్రిల్ 5 వ తారీఖున ఈ సినిమాని విడుదల చేయబోతున్నాం అంటూ దర్శక నిర్మాతలు సినిమా ప్రారంభం అప్పుడే చెప్పేసారు. ఇదే మాట మీద నిన్న మొన్నటి వరకు కట్టుబడి ఉన్నారు కూడా. కానీ ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 5 వ తారీఖున వచ్చే అవకాశాలే లేవంటూ సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందట.

NTR Devara Movie

అంతే కాకుండా ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కి రీసెంట్ గా షూటింగ్ లో మోకాళ్ళకు బలమైన దెబ్బ తగిలిందట. అప్పటి నుండి అతను హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు, ఎప్పుడు పూర్తిగా కోలుకొని మళ్ళీ సెట్స్ మీదకి వస్తాడో తెలియని పరిస్థితి. ఇన్ని ప్రతికూల వాతావరణాలు మధ్య సినిమా రావడం కష్టమే అని అంటున్నారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisement -
JR NTR

త్వరలోనే విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఈ వార్త విని తీవ్రమైన అసహనం కి గురి అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా వచ్చి ఆరేళ్ళు దాటిపోయింది. మళ్ళీ ఏడాది చివరి వరకు ఆగాల్సిందేనా అంటూ బాధపడుతూ పోస్టులు వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here