Upasana : సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్ – ఉపాసన జంట ముందు వరుస లో ఉంటుంది. కొత్త పెళ్లి అవుతున్న ఎంతో మంది దంపతులకు ఈ జంట ఒక ఆదర్శం అని చెప్పడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. కోడలిగా కాకుండా, సొంత కూతురుగా ఆమెని చిరంజీవి, సురేఖ దంపతులు చూసుకున్నారు.

పెళ్లి జరిగి 11 ఏళ్ళు పూర్తి అయినా కూడా పిల్లలు కలగకపోవడం పెద్ద విషయమే. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే కచ్చితంగా విడిపొయ్యే వారేమో కానీ, వీళ్లిద్దరు మాత్రం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని సంతోషం గా జీవించారు. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ ‘క్లిన్ కారా’ అనే ఆడ బిడ్డ జన్మిచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇలా ఎంతో సంతోషం గా ఉన్న ఈ జంట, అప్పట్లో ఒక హీరోయిన్ విషయం లో మాత్రం చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారట.

ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. రామ్ చరణ్ కి ఇండస్ట్రీ లో ఉండే అతి తక్కువ మంది స్నేహితులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమెతో రామ్ చరణ్ దాదాపుగా నాలుగు సినిమాల్లో నటించాడు. అన్నీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం అప్పట్లో మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చేత హద్దులు దాటిపోయే రేంజ్ లో ముద్దులు పెట్టిస్తాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. కాజల్ అగర్వాల్ అలా రామ్ చరణ్ కి ముద్దులు పెట్టడం పై ఉపాసన బాగా ఫైర్ అయ్యిందట. ఇద్దరి మధ్య అప్పట్లో పెద్ద గొడవ కూడా జరిగిందట. మళ్ళీ నువ్వు కాజల్ అగర్వాల్ తో కలిసి నటిస్తే నీకు విడాకులు ఇచ్చేస్తాను అంటూ అప్పట్లో ఉపాసన పెద్ద రచ్చ చేసిందట. అప్పటి నుండి రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడట.
