Surekha Vani గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. నెట్టింట అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటారు. తనతో పాటు కూతురు సుప్రీత కూడా తల్లినే ఫాలో అవుతూ ఉంటుంది. నిత్యం వారికి సంబంధించిన పలు అప్డేట్స్ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈమె తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక వీరిద్దరికీ కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
ఏ విషయం చెప్పాలన్న ఈ బ్యూటీస్ బోల్డ్ పిక్స్ తో ఆ విషయాన్ని వెల్లడిస్తారు. ఇక సురేఖ వాణి తన కూతురిని సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే పేరు ఉన్న హీరోల సరసన నటిస్తేనే.. కూతురికి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయని భావించింది. చిన్న హీరోతో చేస్తే తన కూతురికి పెద్దగా కెరీర్ ఉండదేమోనని ఆమె భయం. అందుకే చిన్న సినిమాలలో నటించనివ్వడం లేదు సురేఖ వాణి. ఇక తాజాగా సురేఖ వాణి తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ క్రమంలోనే తన కూతురి సినిమా ఎంట్రీ పై స్పందించింది. త్వరలోనే తన సినీ ఎంట్రీ ఉంటుందని చెప్పకనే చెప్పింది. దీంతో సుప్రీత అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. టాలీవుడ్ స్టార్ హీరో సరసన సుప్రీతని హీరోయిన్ గా పరిచయం చేయాలని సురేఖవాణి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. తల్లి , కూతుర్లు కలిసి ఆ స్టార్ హీరోని ఇబ్బంది పెడుతున్నారట కూడా. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.