Kurchi Thatha ని మడతపెట్టేసిన పోలీసులు.. ఇక మిగిలిన జీవితం జైలులోనే!

- Advertisement -

Kurchi Thatha సోషల్ మీడియా లో ‘కుర్చీ మడత పెట్టి’ అనే డైలాగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్ మొదట్లో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత దీనిని ఈటీవీ ఎంటెర్టైమెంట్ షోస్ లో కమెడియన్స్ తెగ వాడేశారు. అలా పాపులర్ అయిన ఈ డైలాగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ కి వాడేసాడు.

Kurchi Thatha
Kurchi Thatha

ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ ఒక మోస్తారు రేంజ్ వసూళ్లు వచ్చాయంటే దానికి కారణం కచ్చితంగా ఈ పాటనే అని చెప్పొచ్చు. యూట్యూబ్ లో ఈ పాటకి దాదాపుగా 63 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ డైలాగ్ చెప్పిన తాత పేరు షేక్ అహ్మద్ పాషా. ఒక సాధారణ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ మధ్యలో ఈ డైలాగ్ వాడుతాడు.

ఈ డైలాగ్ తమ సినిమా కోసం వాడుకోనిచ్చినందుకు సంగీత దర్శకుడు థమన్ కుర్చీ తాత ని కలిసి లక్ష రూపాయిలు ఆర్ధిక సహాయం కూడా చేసాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు కుర్చీ తాత కష్టాల్లో పడ్డాడు. ప్రముఖ నటి స్వాతి నాయుడు మరియు వైజాగ్ సత్య అతని పై పోలీస్ కేసు నమోదు చేసారు. ఆయన డబ్బులను కాజేసి మేము వైజాగ్ నుండి పారిపోయాము అంటూ నోటికి ఏది తోచితే అది మాట్లాడి బూతులు తిట్టాడని, దానికి సంబంధించిన ఆధారాలు ఇవేనంటూ పోలీసులకు వెళ్లి వీళ్లిద్దరు కంప్లైంట్ ఇచ్చారట.

- Advertisement -

ఆ తర్వాత విచారణ జరిపిన పోలీసులు కుర్చీ తాత ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా కుర్చీ తాత ఎక్కువగా హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్దనే ఎప్పుడూ కూర్చొని ఉంటాడు. ఇతనికి ఒక్క పెద్ద కుటుంబమే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళను పట్టించుకోకుండా రోడ్ల మీదనే తిరుగుతూ ఉంటాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here