Sitara Gattamaneni : యంగ్ హీరోతో రొమాన్స్ చెయ్యబోతున్న సితార.. మహేష్ ఫ్యాన్స్ కి బ్లాస్టింగ్ అప్డేట్!

- Advertisement -

Sitara Gattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార కి చిన్న వయస్సు నుండే ఎంత మంచి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం మహేష్ బాబు కూతురిగా మాత్రమే కాదు, ఒక మంచి మనసు ఉన్న అమ్మాయిగా సితార ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. తనకి సమయం దొరికినప్పుడల్లా అనాధ పిల్లలతో కలిసి ఉండడం , వారికి అన్నదానం వంటివి చెయ్యడం ఈ అమ్మాయికి బాగా అలవాటు.

Sitara Gattamaneni
Sitara Gattamaneni

అనేక సందర్భాలలో తోటి మనుషుల పట్ల ఈ అమ్మాయి వ్యవహరించే తీరుని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఇంత పరిణీతి ఎలా సాధ్యం అని సితార ని చూసినప్పుడల్లా ప్రతీ ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ కూడా. క్లాసిక్ డ్యాన్స్ వెయ్యడం లో మేటి అనిపించుకున్న సితార ఇది వరకు ఇంస్టాగ్రామ్ లో ఎన్నో రీల్స్ కూడా చేసింది.

Sitara Updates

అంతే కాకుండా తన జీవితం లో చోటు చేసుకునే అరుదైన సంఘటనలను అభిమానులతో ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె తల్లి నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది సితార.

- Advertisement -

అందులో ఒక అభిమాని సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావు అని అడగగా , దానికి సితార సమాధానం చెప్తూ ‘నటనపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది, కచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాను’ అని క్లారిటీ ఇచ్చింది. ఆమె ఈ మాట చెప్పిన వెంటనే సోషల్ మీడియా లో రకరకాల కథనాలు అల్లేశారు నెటిజెన్స్. పలానా హీరో తో సితార హీరోయిన్ గా మొదటి సినిమా అంటూ ప్రత్యేక కథనాలు పుట్టించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here