Vijay Deverakonda : సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ సర్వ సాధారణం. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ గురించి నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు.

గత కొన్నిరోజులుగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరి 14న జరుగుతుందని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. విజయ్ టీమ్ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా విజయ్ సైతం ఈ రూమర్స్ ను ఖండించాడు. ‘లైఫ్ స్టైల్ ఆసియా’ అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన విజయ్.. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే రష్మికతో ఎంగేజ్ మెంట్ గురించిన విషయాన్ని బట్టబయలు చేశారు.

విజయ్ మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరిలో రష్మికతో ఎంగేజ్ మెంట్ అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు. ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం జరగడం లేదు. ఈ మీడియా నాకు ప్రతి రెండు నెలలకోసారి పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ఇదే రూమర్ నేను ప్రతి ఏడాది వింటూనే ఉన్నాను. నన్ను పట్టుకుని, నాకు పెళ్లి చేయాలని చూస్తుందేమో ఈ మీడియా.. నాకు తెలియదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక, విజయ్ వారి వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అనిమల్ పార్క్, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.