JR NTR – Anushka : సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతుంటాయి. వాటిని తెరపై చూడాలంటూ అభిమానులంతా ఎదురుచూస్తుంటారు. కొన్ని కాంబినేషన్లు సెట్ అయినప్పటికీ మరికొన్ని కాంబినేషన్లు మాత్రం చర్చల వరకే పరిమితమవుతుంటాయి. వాటిని ఎలాగైనా వెండితెరపై చూడాలనుకున్నప్పటికీ అవి సఫలం కావు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు సెట్ అయినట్లే అయి తర్వాత మిస్సయ్యాయి. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో చింతకాలయ రవి చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుంది.
ఈ సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్ ను హీరో అనుకున్నారు. కానీ ఆ సినిమాను యంగ్ టైగర్ తిరస్కరించాడు. కాకపోతే ఇదే సినిమాలో చిన్న అతిథి పాత్రలో మెరిశాడు. కేవలం రెండు నుంచి మూడు నిముషాల సమయమే తారక్ ను, అనుష్కను దగ్గర దగ్గరగా చూడగలం. ఆ రకంగా ఈ మొదటి కాంబినేషన్ కుదరలేదు. ఊసరవెల్లి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ నటనపరంగా ఈ సినిమా హిట్ అయింది. ఇందులో మొదట అనుష్కను అనుకున్నారు. అయితే, తర్వాత కొన్ని కారణాల వల్ల తమన్నా వచ్చేసింది. ముచ్చటగా మూడో సినిమా.. జనతా గ్యారేజ్.
తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో సమంత పోషించిన పాత్రకోసం ముందుగా అనుష్కను అనుకొని ఆమెను సంప్రదించారు మేకర్స్. అయితే అనుష్క ఈ పాత్రను కూడా తిరస్కరించింది. తర్వాత సమంత దగ్గరకు ఆ రోల్ వెళ్లగా ఆమె ఎంపిక చేసుకుంది. అలా తారక్ – అనుష్క కాంబినేషన్ లో మూడు సినిమాలు మిస్సయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురుచూసినప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు.