Samantha : పెళ్లి అయ్యాక నాగచైతన్య అలా చేసేవాడు.. షాకింగ్ విషయాలు చెప్పిన సమంత

samantha


Samantha , నాగ చైతన్య విడిపోయి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. అప్పుడుప్పుడూ సమంతే చెప్పీచెప్పనట్లుగా తన చేదు జ్ఞాపకాలను పంచుకుంటోంది. ముఖ్యంగా తాను మయోసైటిస్ బారిన పడినప్పటి నుంచీ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ వస్తోంది. ఈ మధ్యే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్లో అభిమానులతో ఆమె ముచ్చటించింది.

Samantha
Samantha

ఈ సందర్భంగా నాగ చైతన్య పేరు ప్రస్తావించకుండానే గతంలో తన భాగస్వామిగా ఉన్న వ్యక్తి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని, అందుకే తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి తనకు తెలియదని ఆమె అనడం విశేషం. ఈ ఎపిసోడ్ పై ఆమె ఇంకా ఏమన్నదో ఒకసారి చూద్దాం. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్లో ఇంటరాక్షన్ సందర్భంగా ఓ అభిమాని ఆమెను ఓ ప్రశ్న అడిగారు. “ఒకవేళ మీ వ్యక్తిగత వృద్ధి ఓ హైలైట్ రీల్ అయితే.. అందులో మీరు బాగా నవ్వుకునే బ్లూపర్ ఏది.. అలాగే మీకు జీవిత పాఠం నేర్పిన ఆస్కార్ లెవల్ మూమెంట్ ఏది” అని ప్రశ్నించారు.

Samantha Naga Chaitanya

దీనికి సమంత స్పందిస్తూ.. చైతన్య పేరు ప్రస్తావించకుండా అతన్ని నిందించింది. “బహుషా నేను చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే.. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలం కావడమే అనుకుంటాను. ఎందుకంటే ఆ సమయంలో నా భాగస్వామిగా ఉన్న వ్యక్తి వాటిని ఎప్పుడూ ప్రభావితం చేస్తుండేవాడు” అని సమంత చెప్పింది. చై పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఎవరి గురించి మాట్లాడుతుందో ఫ్యాన్స్ కు అర్థమైపోయింది.