Animal గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ‘ఎనిమల్’ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ ఎవరో కూడా మన ఆడియన్స్ కి సరిగా తెలియదు.
అలాంటి హీరో సినిమాకి ఈ రేంజ్ ఆదరణ దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఈ నెల 26 వ తారీఖు నుండి నెట్ ఫ్లిక్స్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్నట్టుగా రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన ఒకటి చేసింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు హై కోర్టు షాక్ ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా సినిమాని నిర్మించిన టీ సిరీస్ బ్యానర్ తో సినీ వన్ అనే సంస్థ సినిమా విడుదలయ్యాక వచ్చిన లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుందట. కానీ సినిమా విడుదల తర్వాత టీ సిరీస్ సంస్థ తనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సినీ వన్ సంస్థ అధినేత రీసెంట్ గానే ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించారు. తమకి న్యాయం జరిగే వరకు ఎనిమల్ మూవీ ఓటీటీ లో విడుదల అయ్యేందుకు అనుమతిని నిరాకరించాలంటూ ఢిల్లీ హై కోర్ట్ లో పిటీషన్ ని దాఖా చేసారు.
దీనిపై టీ సిరీస్ సంస్థ అధినేతలను వివరణ కోరగా తమకి ఆ సినిమా హక్కులను 2 కోట్ల 20 లక్షల రూపాయలకు వదులుకుంటున్నాం అని సినీ వన్ వారు మాతో ఒప్పందం చేసుకున్నారని, దానికి సంబంధించిన ఒప్పందం పత్రం ఇదేనంటూ కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేసారు. తమ వద్ద ఈ ఒప్పందం గురించి ఎందుకు దాచి పెట్టారు అని సినీ వన్ సంస్థ పై మండిపడింది అట హై కోర్ట్. దీని పై వివరణ ఇవ్వాలంటూ సినీ వన్ సంస్థ ని డిమాండ్ చేసిందట. నిజానిజాలు తేలే వరకు ‘ఎనిమల్’ ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆపాలని హై కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. రేపు తుది విచారణ జరగనుంది. ఈ విచారణ తర్వాత వచ్చే తీర్పుని బట్టే జనవరి 26 న ఎనిమల్ ఓటీటీ లోకి వస్తుందా లేదా అనేది తెలుస్తాది.