హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్న నటుడు రంగనాథ్. సుమారుగా నాలుగు దశాబ్దాలు ఆయన ఇండస్ట్రీ లో కొనసాగాడు. అలాంటి లెజెండ్ 2015 వ సంవత్సరం లో తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
సినిమాల్లోకి రాకముందు రైల్వే స్టేషన్ లో ఒక టికెట్ కలెక్టర్ గా పని చేస్తూ జీవనం సాగించిన రంగనాథ్, సినిమాల మీద విపరీతమైన మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. అలా కష్టపడి అవకాశాలను సంపాదించిన రంగనాథ్ అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని స్థిరపడి లెజండరీ స్థానం ని దక్కించుకున్నాడు. అలాంటి లెజెండ్ తన జీవితాన్ని ఇంత అర్థాంతరంగా ముగించడం టాలీవుడ్ కి పూడవలేని నష్టం.
రంగనాథ్ 13 ఏళ్ళ నుండి మంచాన పడిన తన భార్య కి సేవలు చేసుకుంటూ వచ్చాడు. ఆయనకీ ఇద్దరుకు కొడుకులు, ఒక కూతురు ఉంది. అందరికీ పెళ్లిళ్లు అయ్యి జీవితం లో స్థిరపడ్డారు. కానీ రంగనాథ్ తన భార్య చనిపోయిన తర్వాత బాగా ఒంటరితనం కి గురై, మానసిక వేదనని పొందాడు. అలాంటి సమయం లో తన బాగోగులు చూసుకోవడానికి ఆయన కోడలు ఇంట్లో ఒక పని మనిషిని పెట్టింది. ఆమె రంగనాథ్ కి చివరి రోజుల్లో ఎంతో సేవలు చేసింది. రంగనాథ్ ఆమెని తన భార్యగా స్వీకరించాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే చనిపోయే ముందు ఆయన గోడ మీద ‘ఆ బీరువాలో ఉన్న ఆస్తి వీలునామా మొత్తం పని మనిషి పేరిట రాయండి’ అని రాసి చనిపోయాడు. ఇది చూసిన పోలీసులు పని మనిషి పై అనుమానపడ్డారు. ఆస్తి కోసం ఆమెనే ఇలా రాసి రంగనాథ్ ని చంపి ఆత్మహత్య గా చిత్రీకరించి ఉండొచ్చు కదా అనే కోణం లో దర్యాప్తు చేసారు. కానీ ఈ దర్యాప్తు లో పని మనిషి తప్పిదం ఏమి లేదని తెలుసుకొని ఆమెని విడిచిపెట్టారు.