Samantha : హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అగ్ర హీరోల అందరి సరసన నటించిన సమంత.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్తో బాధపడుతూ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నాకు ఇవంటే చాలా భయం అంటూ సమంత చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సమంతను భయపెట్టినవి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. చూద్దాం.

సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫారిన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతలోనే కొత్త విషయం బయటకు చెప్పింది. తనకు పువ్వులు అంటే ఎలర్జీ అని.. వాటిని ముట్టుకోవాలన్నా భయమేస్తుందని చెప్పింది. తను instagramలో ఫ్లవర్ బొకే తీసుకుంటూ సంతోషకరమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ఆ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటూ తనకు ఉన్న సమస్య గురించి చెప్పింది. పూల వల్ల తాను ఓ సారి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ క్యాప్షన్ ఇచ్చింది. మీరు ఈ అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు.. కానీ గతం నన్న భయపెడుతుంది.. ఎందుకంటే చివరిసారి మీరు నన్ను ఐసీయూలోకి పంపారంటూ పూల గురించి వివరించింది.

పూలతో నరకం ఎవరికి ఇష్టం అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం యాక్టింగ్ కు విరామం ఇచ్చి మయోసైటిస్ నివారణకి చికిత్స పొందుతోంది. ఇక తాజాగా మయో సైటీస్ నుంచి కోలుకుని సమంత ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో సోషల్ మీడియాలో నా హావాభావాలు, నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎన్నో ట్రోల్స్ కు గురయ్యానని.. ఒక స్పెషల్ ట్రోల్స్ బ్యాచ్ లక్ష్యంగా మారారని.. అయినప్పటికీ నేను నాలా ఉండడం చాలా స్వీట్నెస్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టేందుకు.. భారీ ప్రాజెక్టులతో అలరించేందుకు సామ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.