’90s’ web series కోసం శివాజీ తీసుకున్న రెమ్యూనరేషన్ బిగ్ ప్రైజ్ మనీ కంటే ఎన్ని రెట్లు ఎక్కువనో తెలుసా!

- Advertisement -

’90s’ web series హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా సుమారుగా 96 సినిమాలు చేసిన శివాజీ ఎన్నడూ చూడని క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని చూసింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారానే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన సంపాదించిన క్రేజ్ అంతా ఇంత కాదు. కేవలం ఆయన వల్లే ఆ షో అంత పెద్ద హిట్ అయ్యింది అనొచ్చు.

చెయ్యి బాగాలేక ఇంటికి వెళ్ళిపోతాను అని ఎన్నోసార్లు బిగ్ బాస్ ని అడిగినా అతన్ని పంపకుండా బిగ్ బాస్ హౌస్ లోనే ఉంచుకున్నారు అంటే అతని వల్లే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ షో నుండి బయటకి వచ్చిన వెంటనే ఆయన నటించిన వెబ్ సిరీస్ ’90s’ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతూ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత చేసిన వెబ్ సిరీస్ అట ఇది. బిగ్ బాస్ షో పూర్తి అయ్యాక శివాజీ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ విడుదల చేసారు. ప్రతీ ఒక్కరు ఈ వెబ్ సిరీస్ చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సిరీస్ ని చూసి గుర్తి తెచ్చుకున్నాం అని, ఇలాంటి అద్భుతమైన సిరీస్ చేసినందుకు శివాజీ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఈ సిరీస్ కి ఇప్పటి వరకు 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట.

- Advertisement -

ఇప్పటి వరకు ఈటీవీ విన్ యాప్ లో ఇన్ని వ్యూస్ వచ్చిన వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ లేదట. ఇకపోతే ఈ సిరీస్ లో నటించినందుకు గాను శివాజీ కి దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చారట. ఇది బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే రెండింతలు ఎక్కువ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here