Mahesh Babu : మన టాలీవుడ్ హీరోలు సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగం లో కూడా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలం నుండి వ్యాపారాల్లో కోట్ల రూపాయిల లాభాల్ని అర్జిస్తూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాల్లో ఈయన ఎంత పెద్ద సూపర్ స్టారో, వ్యాపార రంగం లో కూడా ప్రస్తుతం ఈయనకి దగ్గర్లోకి వచ్చే మరో స్టార్ హీరో లేడు.
హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ముల్టీప్లెక్స్ థియేటర్ ఏదైనా ఉందా అంటే అది మహేష్ బాబు – ఏషియన్ సంస్థ కాంబినేషన్ లో నిర్మించిన ‘AMB సినిమాస్’ అనే చెప్పాలి. ఈ థియేటర్ లో సినిమా చూసినప్పుడు వచ్చే థియేట్రికల్ అనుభూతి, హైదరాబాద్ లో ఏ థియేటర్ లో కూడా రాదనీ అందరూ అంటూ ఉంటారు. అలా ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారం ని కొనసాగిస్తున్న మహేష్ బాబు , గత ఏడాది ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఒక రెస్టారంట్ ని కూడా ప్రారంభించాడు.
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో AN ప్యాలస్ హైట్స్ అనే పేరు తో నడుస్తున్న ఈ రెస్టారంట్ ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక బ్రాండెడ్ రెస్టారంట్ అయిపోయింది. అంత గొప్ప రెస్టారంట్ కదా, ఒక్కసారి ఆ రెస్టారంట్ లో ఐటమ్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దాం అని జేబులో వంద రూపాయిలు పెట్టుకొని వెళ్ళకండి. ఎందుకంటే ఆ వంద రూపాయిలను ఆ రెస్టారంట్ లో సర్వర్స్ టిప్ గా కూడా తీసుకోరు. అంత రిచ్ రెస్టారంట్ అన్నమాట అది. ఈ రెస్టారంట్ లో మన రోజు తినే ఆహార పదార్దాలే ఉంటాయి.
కానీ ఒక్కోటి వందల్లో ఉంటాయి. ప్లేట్ ఇడ్లీ , ఒక దోస తిన్నావంటే 500 నుండి 600 రూపాయిల వరకు అవుతుంది. అంత రేట్స్ ఉన్నాయి ఇందులో ఏముందో అంత స్పెషల్ ఒకసారి ట్రై చేద్దాం అంటే చెయ్యండి. ఇకపోతే రెస్టారంట్ ఒక్క రోజులో దాదాపుగా 8 నుండి 10 లక్షల రూపాయిలను రాబడుతుంది. అంత డబ్బు ఒక మధ్య తరగతి కుటుంబస్తుడికి ఉంటే తన స్థలం లో అందమైన ఇల్లు కట్టుకునేవాడు.