Niharika Konidela : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు నిహారిక కొణిదెల. తన జీవితం లో జరిగే ప్రతీ విషయాన్నీ ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎల్లప్పుడూ తన స్నేహితులతో కలిసి చిల్ అవుతూ ప్రపంచం మొత్తం వరల్డ్ టూర్స్ వేస్తూ ఉంటుంది. ఈమధ్య తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత నుండి అయితే ఈమె పంజరం నుండి బయటకి వచ్చిన పావురం లాగ మారిపోయింది.
అంతకు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, పెళ్లి తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చి కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఒకపక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంది. కానీ బాధపడాల్సిన విషయం ఏమిటనే ఈమెకి నటిగా, నిర్మాతగా రెండింటిలోనూ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా లేదు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె థాయిలాండ్ కి వెళ్ళింది. ఎవరైనా సెలెబ్రిటీలు అక్కడికి వెళ్లిన తర్వాత బీచుల చుట్టూ తిరుగుతూ, థాయ్ మసాజులు చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ నిహారిక మాత్రం అక్కడ అడవుల్లో తిరుగుతూ కూర్చుంది. అడవిలో కాసేపు స్వేచ్ఛ తిరిగి, అక్కడి ఏనుగులకు ఆహరం తినిపిస్తూ కనిపించింది. అంతే కాదు అడవుల్లో ఈమె అక్కడ ఉన్న మూగజీవాలు మొత్తం సురక్షితంగా ఉండడానికి పూజలు కూడా చేయించింది.
దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిహారిక ని ఇలా చూసిన నెటిజెన్స్ ఏమైంది ఈ అమ్మాయికి?, కుర్ర వయస్సులో ఎవరైనా థాయిలాండ్ కి పోతే చిల్ అవుతారు. కానీ ఈమె మాత్రం జీవితం మీద వైరాగ్యం వచ్చిన అమ్మాయిలాగా అడవుల్లో జంతువులతో కలిసి తిరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.