Veera Simha Reddy and Waltair Veerayya : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి,చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..జనవరి 12న వీరసింహరెడ్డి, 13న ‘వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి..ఆ సినిమాలు రెండు కూడ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ సంక్రాంతి బరిలో ఎవరు హీరోగా నిలిచారు అంటూ ప్రస్తుతం కొన్నీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇంతకీ సంక్రాంతి పండగలో అసలు విన్నర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది ఓటింగ్ నిర్వహించారు.ఇందులో చాలామంది నెటిజన్స్ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి ప్రధాన కారణం వీర సింహారెడ్డి సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాలు,ఎమోషన్స్, పొలిటికల్ డైలాగులు, సంగీతం ఇలా అన్ని వీరసింహారెడ్డికి ప్లస్ అయ్యాయి..చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య బాగున్నా కూడా ఎక్కువ మందిని మెప్పించింది మాత్రం బాలయ్య సినిమానే అని తెలుస్తుంది…
అయితే ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. సంక్రాంతి బరిలో మా హీరోనే విన్నర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ నానా రచ్చ చేస్తున్నారు.కానీ మెగా అభిమానులు మాత్రం కేవలం ఒక్క రోజుకే హీరో ఎవరో నిర్ణయించడంఅంత సులువైన పని కాదు. ఇప్పుడే సంక్రాంతి విన్నర్ మా హీరో అంటే ఎలా ఇంకా ముందు ముందు చూడాలి అసలు హీరో ఎవరో అని వారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక వారం గడిస్తే గాని అసలు విన్నర్ ఎవరో చెప్పే పరిస్థితిలో లేరు సినీ విశ్లేషకులు..ప్రస్తుతానికి ఇద్దరు విన్నర్స్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..