Sreemukhi : కొత్త ఏడాది గుడ్ న్యూస్ చెప్తానంటున్న శ్రీముఖి.. అదెంటో మాకు తెలిసిందోచ్

- Advertisement -

Sreemukhi : బుల్లితెరపై యాంకర్స్ ఎంతమంది ఉన్నా నంబర్ వన్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. కానీ ప్రస్తుత జనరేషన్లో మాత్రం టాప్ యాంకర్ అంటే గుర్తుకు వచ్చేసి శ్రీముఖి. పటాస్ షోతో బాగా పాపులారిటీ సంపాదించుంది. అందులో రాములమ్మగా గంపెడంత నోరేసుకుని తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాటకు తోడు అందచందాలతో అలరిస్తూ కుర్రకారును కనులు తిప్పుకోనివ్వకుండా చేసేస్తోంది. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా కెరీర్ లీడ్ చేస్తుంది.

Sreemukhi
Sreemukhi

కాగా మూడు పదులు వచ్చినా.. పెళ్లి ప్రస్తావనే లేదు. ఆమె పెళ్లి వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . 2024 లో శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతూనే ఉంది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వచ్చిన శ్రీముఖి 2024లో ఎట్టి పరిస్థితులోనూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట.

Sreemukhi  Photos

తన ఫ్రెండ్స్ వద్ద నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, న్యూ రిలేషన్షిప్, న్యూ హోప్స్ అంటూ ఆమె కొత్త బంధానికి సంబంధించిన సీక్రెట్ ను రివిల్ చేయబోతుందన్న వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో సార్లు ఇలాంటి పుకార్లు వచ్చాయి. అయితే ఎప్పటిలాగే ఈ న్యూస్ ఫేక్ నా..? లేకపోతే నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? అన్నది తెలియాలంటే శ్రీముఖి నోరు విప్పాల్సిందే. శ్రీముఖి తన పెళ్లి గుడ్ న్యూస్ చెప్తే వినాలని అభిమానుల కోరిక చూద్దాం ఏం జరుగుతుందో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here