Ram Charan – Sobhita Dhulipala : తాజాగా రామ్ చరణ్, శోభితా ధూళిపాళను స్క్రీన్‌పై పెయిర్‌గా చూడాలని ఆడియన్స్‌లో కోరిక మొదలయ్యింది. దానికి కారణం ఒక యాడ్. వీరిద్దరు కలిసి 1 నిమిషం నిడివి ఉన్న యాడ్‌లో కనిపించారు. దీంతో పెయిర్ చాలా క్యూట్‌గా ఉందని, కలిసి సినిమాలో కనిపించాలని నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్, శోభితా కలిసి నటించిన యాడ్‌లో ఇద్దరూ భార్యభర్తలుగా కనిపించారు.
దీంతో ఒక్కసారిగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. 1 నిమిషంలోనే ఈ పెయిర్ చూడడానికి ఇంత బాగుంటే.. ఒకవేళ ఒక సినిమాలో కలిసి నటిస్తే.. ఇంకెంత బాగుంటుందో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఒక క్లాత్ బ్రాండ్ కోసం రామ్ చరణ్, శోభితా కలిసి యాడ్‌లో నటించారు. ఇందులో పెళ్లికూతురు గెటప్‌లో శోభితా ఎదురుచూస్తూ ఉండగా.. పెళ్లికొడుకు గెటప్‌లో రామ్ చరణ్ మండపానికి ఆలస్యంగా వస్తాడు.
దీంతో శోభితా అలక చూపిస్తుంది. దానికి రామ్ చరణ్ క్యూట్‌గా బ్రతిమిలాడుకుంటాడు. ఈ క్రమంలో అతను కాళ్లు పట్టుకుని మరీ ఆమెకు క్షమాపణ చెప్తూ మెట్టెలు తొడుగుతాడు. తన జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. ఈ సూపర్ డ్రామా మాన్యవర్ ‘వివాహం’ కలెక్షన్‌కు సంబంధించినది కాగా తెలుగు, తమిళ్, కన్నడలో ఈ యాడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.ఇదంతా చూసి.. ప్రేక్షకులు ఈ యాడ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.