Salaar : కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం ఎట్టకేలకు ఎల్లుండి భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కంటే అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడని మొన్న విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ ని చూస్తేనే అర్థం అయిపోతుంది.
![Salaar](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-617-1024x614.png)
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. బుకింగ్స్ ట్రెండ్ మామూలు రేంజ్ లో లేదు. టైక్ట్స్ ఆన్లైన్ లో పెట్టినంతసేపు కూడా లేదు, క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ చిత్రానికి హిందీ లో చాలా అన్యాయం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రం కోసం పీవీఆర్ మరియు ఐనాక్స్ థియేటర్స్ లో సలార్ కి షోస్ దక్కనివ్వకుండా చేస్తున్నారు.
![Salaar Movie](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-618-1024x512.png)
షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. అయితే ఆ చిత్ర మేకర్స్ ఎట్టి పరిస్థితిలో కూడా ‘సలార్ ‘ చిత్రానికి షోస్ కేటాయించడానికి వీలు లేదని పీవీఆర్ మరియు ఐనాక్స్ థియేటర్స్ తో ఒప్పందం చేసుకున్నారట. ఇలా ఉద్దేశపూర్వకంగా సలార్ చిత్రానికి నష్టం చెయ్యాలని చూసిన ఈ రెండు థియేటర్స్ చైన్స్ కి ఝలక్ ఇస్తూ సౌత్ లో సలార్ మూవీ ని పీవీఆర్ మరియు ఐనాక్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యము అని ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇది ఆ సంస్థలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
![Prabhas](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-619.png)
ఎందుకంటే సలార్ చిత్రాన్ని వదులుకుంటే వాళ్ళకే పెద్ద నష్టం. సౌత్ లో సలార్ కి మొదటి 5 రోజులు వచ్చే వసూళ్లు వేరే లెవెల్ లో ఉంటాయి. ఇలాంటి సమయం లో థియేట్రికల్ రెవిన్యూ మిస్ చేసుకోవాలని ఎవ్వరూ కూడా అనుకోరు. కాబట్టి పీవీఆర్ , ఐనాక్స్ థియేటర్స్ యాజమాన్యాలు ఒక మెట్టు క్రిందకి దిగి సంధికి వస్తారో లేదో చూడాలి.