Ram Charan : సుమారుగా 12 ఏళ్ళ నిరీక్షణ తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు క్లిన్ కారా అనే ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పాప పుట్టినప్పటి నుండి దంపతులిద్దరూ ఎంతో అపురూపం గా చూసుకుంటున్నారు. పాప పుట్టిన వేళావిశేషం ఎన్నో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పాప పుట్టిన ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పాప ముఖాన్ని ఫ్యాన్స్ కి చూపించలేదు.
అభిమానులు ఎప్పుడెప్పుడు క్లిన్ కారా ముఖాన్ని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా క్లిన్ కారా విషయం లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ మరియు ఉపాసన రీసెంట్ గా క్లిన్ కారా తీసుకొని ఒక ఈవెంట్ కోసం ముంబై కి వెళ్లారు. అక్కడ ప్రముఖ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇంట్లో ఆతిధ్యం తీసుకున్నారట.
ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు క్లిన్ కారా ని తీసుకెళ్తే బాగుండదు అని కరీనా కపూర్ ఇంట్లోనే వదిలేసి వెళ్లారట. ఆరోజు ఇంట్లో కరీనా కపూర్ తప్ప ఎవ్వరూ లేరు, భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా షూటింగ్ కోసం ఇతర దేశం లో ఉన్నాడు. దీంతో క్లిన్ కారా కి సంబంధించిన పనులన్నీ రామ్ చరణ్ – ఉపాసన తిరిగి వచ్చే వరకు కరీనా కపూర్ దగ్గరుండి మరీ ఒక ఆయా లాగ చూసుకుంది అట.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు గతం లో తన పిల్లలకు పని చేసిన ఆయా ని కూడా రామ్ చరణ్ ఉపాసన ని పనిలో పెట్టుకోమని సలహా ఇచ్చిందట. ఇప్పుడు క్లిన్ కారా కి ఆయా గా కరీనా కపూర్ రికమెండ్ చేసిన ఆమెనే ఆయాగా పని చేస్తుంది.