Kajal Aggarwal : చిరంజీవి తో సినిమా చెయ్యాలంటే నరకం గా ఉంటుంది అంటూ కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Kajal Aggarwal : మన టాలీవుడ్ లో డ్యాన్స్ అద్భుతంగా వేసే హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు హీరోలు వేస్తున్న మూవ్మెంట్స్ ఆయన అప్పట్లోనే వేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు డ్యాన్స్ అద్భుతంగా వేసే హీరోలందరికీ ఆయనే ఆదర్శం. అలాంటి మెగాస్టార్ తో సమానంగా డ్యాన్స్ వెయ్యడం హీరోయిన్స్ కి చాలా కష్టమే.

Kajal Aggarwal
kajal aggarwal

అప్పట్లో భాను ప్రియా మరియు రాధ వంటి వారు చిరంజీవి డ్యాన్స్ మూవ్మెంట్స్ కి పోటీని ఇచ్చేవారు. వాళ్ళు కూడా మెగాస్టార్ ని సింగల్ టేక్ లో మ్యాచ్ చేసేవాళ్ళు కాదు. కనీసం 5 టేకులు అయినా పడాల్సిందే. వాళ్ళిద్దరి తర్వాత చిరంజీవి తో చాలా కంఫర్ట్ గా డ్యాన్స్ వేసింది రంభ మాత్రమే. ఆ తర్వాతి తరం హీరోయిన్స్ మెగాస్టార్ గ్రేస్ మూవ్మెంట్స్ మ్యాచ్ చెయ్యడానికి ఎంతో కష్టపడేవారు. అలా ఈ తరం హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ అంత ఇబ్బంది పడిందట.

కాజల్ తో ఇప్పటి వరకు చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మరియు ‘ఆచార్య’ వంటి సినిమాలు చేసాడు. వీటిల్లో ఖైదీ నెంబర్ 150 చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగా ఆచార్య చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆచార్య సినిమాలో కాజల్ ఎక్కడా కనిపించదు. ఆమెకి సంబంధించిన సన్నివేశాలు మొత్తం సినిమా నుండి తొలగించేసారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి గురించి కాజల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘నేను ఎంతో మంది హీరోలతో పని చేశాను, అందరితో డ్యాన్స్ చాలా తేలికగా వెయ్యగలిగాను కానీ, చిరంజీవి సార్ తో వేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. టేకులు ఎక్కువ తీసుకునేదానిని. చిరంజీవి గారు ప్రతీ స్టెప్ ని కేవలం ఒక్క టేకులోనే చేసేవారు, కానీ నాకు 5 నుండి 7 టేకులు అయ్యేది. ఒకపక్క అంత పెద్ద స్టార్ ని ఇబ్బంది పెడుతున్నాను అనే బాధ, మరోపక్క సరిగా చెయ్యట్లేదు అని ఎక్కడ తిడుతాడేమో అని భయం, నరకం అనుభవించాను’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here