Pallavi Prashanth : క్యాష్ ప్రైజ్ కాకుండా పల్లవి ప్రశాంత్ 15 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా?

- Advertisement -

Pallavi Prashanth : బిగ్ బాస్ రియాలిటీ షో అంటే కేవలం టాప్ సెలబ్రిటీస్ ఆడుకునే షో, సామాన్యులు ఈ షో లోకి ఎంటర్ అవ్వడమే కష్టం అని ఇంతకు ముందు అనుకునేవాళ్లు. కానీ ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ అనే సామాన్యమైన వ్యక్తి, ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, అడవి పులి లాగ టాస్కులను అద్భుతంగా ఆడుతూ, ఇంత అద్భుతంగా ఆడే కంటెస్టెంట్ ని బిగ్ బాస్ చరిత్రలోనే ఎక్కడా చూడలేదు అని అనిపించే రేంజ్ ఆడాడు.

Pallavi Prashanth
Pallavi Prashanth

చివరికి హౌస్ లో ఎంతో మంది సెలెబ్రిటీలను దాటుకొని విన్నర్ గా బయటకి వచ్చాడు. విన్నర్ గా నిల్చిన పల్లవి ప్రశాంత్ కి 35 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ, ఒక కార్ మరియు జాయ్ అలుకాస్ వారు అందించిన 15 లక్షల రూపాయిలు విలువ చేసే నగదు దక్కింది. అంటే దాదాపుగా పల్లవి ప్రశాంత్ 60 లక్షల రూపాయిలు ప్రైజ్ మనీ గా గెలుచుకున్నాడు అన్నమాట.

Pallavi Prashanth Winner

తాను గెలిచిన 35 లక్షల రూపాయిలను ఆపదలో ఉన్న రైతులకు ఉపయోగిస్తాను అని చెప్పిన పల్లవి ప్రశాంత్, ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే రైతులకు డబ్బు సహాయం చెయ్యబోతున్నాడు అట. ఇకపోతే ప్రైజ్ మనీ కాకుండా 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు పల్లవి ప్రశాంత్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

- Advertisement -
Bigg boss telugu

అందుతున్న సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ ఉన్న 15 వారాలకు కేవలం 12 లక్షల రూపాయిలు మాత్రమే అందుకున్నాడు అట. ఈ సీజన్ లో వచ్చిన అందరి కంటెస్టెంట్స్ కంటే పల్లవి ప్రశాంత్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. టైటిల్ గెలవడం మంచికే అయ్యింది, లేకపోతే ప్రశాంత్ ఇన్ని రోజులు పడిన కష్టానికి లాభం లేకుండా పోయేది అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here