Taapsee Pannu : తొమ్మిదో తరగతిలోనే ప్రేమలో మునిగిపోయిన తాప్సీ.. అన్ని లేతవయసులోనే అయ్యాయిట..

- Advertisement -

Taapsee Pannu : తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎదిగింది… తాప్సీ పన్ను. సినిమా రంగంలోని వివాదాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు కుండ బద్దలుకొట్టేలా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందీ పంజాబీ భామ. ప్రస్తుతం ‘డంకీ’తో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైన ఈ సొట్టబుగ్గల సుందరి తన ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను ఇలా పంచుకుంది. ‘‘నిజం చెప్పాలంటే అందానికి పరిమితులుగా చెప్పుకునేవాటికి నేను సరిపోను. నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. అలాగే ముక్కు, పెదవులు కూడా అంత అందంగా ఏమీ కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా ఉంటుంది. అందుకే మొదట్లో సెలూన్‌కి వెళ్లి రకరకాల కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా మార్చుకునేందుకు ప్రయత్నించా.

Taapsee Pannu
Taapsee Pannu

అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక జుట్టు రాలడం మొదలైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్య ప్రపంచానికి అందంగా కనిపిస్తామని కొంతకాలానికి అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. నేను డైట్‌కి, డైటీషియన్స్‌కు ఎక్కువగా ఖర్చుపెడుతుంటా. ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. నా వృత్తికి అది చాలా అవసరం. ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతాన్ని బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

Taapsee Pannu Photos

అందుకే ఆహార నియమాలు, అలవాట్ల గురించి సూచనలు చేసేందుకు నెలకు లక్షకు పైగా జీతం ఇచ్చి మరీ ఓ డైటీషియన్‌ను నియమించుకున్నా. తొమ్మిదో తరగతిలోనే నా ఫస్ట్‌ రిలేషన్‌ మొదలైంది. కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. పదవ తరగతిలోకి రాగానే చదువుమీద దృష్టిపెట్టాలని చెప్పి అతడు నన్ను దూరం పెట్టేశాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్లు ఉండేవికావు. ఓరోజు మా ఇంటి సమీపంలో ఉండే టెలీఫోన్‌ బూత్‌ నుంచి అతడికి కాల్‌ చేసి బాగా ఏడ్చేశా. అతడి జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు కొన్ని నెలలు పట్టింది. ఏది ఏమైనా తొలిప్రేమ ఎవరికైనా ఓ మధర జ్ఞాపకమే’’ అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here