Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి బాలనటుడిగా చేసిన సినిమా ఏంటో తెలుసా?

- Advertisement -


Rajamouli : పాన్ ఇండియా డైరెక్టర్‌గా రాజమౌళి ఎంత పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. సినీ కెరీర్‌లో అసలు ఫ్లాప్‌ని చూడని దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ముఖ్యంగా బాహుబలి తర్వాత రాజమౌళి ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి RRR సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకుడే కాదు నటుడు కూడా.

Rajamouli
Rajamouli

ఆయన నటుడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించే ముందే తన సినిమాలో ఏ సన్నివేశంలో ఎలా నటించాలో స్వయంగా తానే నటించి హీరోలకు చూపిస్తాడు. అంతే కాదు రాజమౌళి ఓ సినిమాలో బాలనటుడిగా వెండితెరపై కూడా కనిపించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజమౌళి నటించిన సినిమా విషయానికి వస్తే… అది “పిల్లనగ్రోవి”. ఈ సినిమాలో ఆయన బాలనటుడిగా నటించాడు.

SS Rajamouli

1983లో తెరకెక్కిన ఈ సినిమా.. అప్పుడు రాజమౌళి వయసు 10 ఏళ్లు. రాజమౌళి బ్యాడ్ లక్ ఏంటంటే.. ఇప్పటికి ఈ సినిమా విడుదల కాలేదు. అయితే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓ సినిమాలో బాలనటుడిగా కూడా నటించానని రాజమౌళి స్వయంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here