Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘దఢక్’ అనే హిందీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. కానీ ఆమె అందం కి యూత్ మెంటలెక్కిపోతారు.
ఒకేఒక్క హిట్ పడితే జాన్వీ కపూర్ శ్రీదేవి కూడా చూడని పీక్ కెరీర్ ని చూస్తుంది అంటూ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో తెలిపారు. కానీ అందం, టాలెంట్ మరియు బ్యాక్ గ్రౌండ్ తో పాటుగా అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం కలిసిరాకనే జాన్వీ కపూర్ కి ఇంకా పెద్ద హిట్ రాలేదని ఆమె అభిమానుల అభిప్రాయం. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే జాన్వీ కపూర్ చాలా కాలం నుండి శిఖర్ పహారియా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ లో ఎప్పటి నుండో టాక్ ఉంది. అతనితో కలిసి జాన్వీ కపూర్ పార్టీలకు పబ్బులకు వెళ్లడం, దానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గానే వీళ్లిద్దరు మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీ జ్యోతిర్లింగ దేవాలయం లో పూజలు చేస్తూ కనిపించారు.
వీళ్లిద్దరి పూజా కార్యక్రమాలు చూసి ఎవరికీ తెలియకుండా ఉజ్జయినీ దేవాలయం లో పెళ్లి చేసేసుకున్నారు అంటూ బాలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. ఆ ఫోటోలను చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు అనే చెప్పాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా కారణంగా ఈ వార్తలపై జాన్వీ కపూర్ స్పందిస్తుందో లేదో చూడాలి.