Bigg Boss Telugu : ఓట్ల కోసం అన్నదానాలు చేయిస్తున్న శివాజీ పీఆర్ టీం.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా.. ఇదేమి మాఫియా బాబోయ్!

- Advertisement -

Bigg Boss Telugu : ఎలాంటి పరిస్థితి ని అయినా తనకి అనుకూలంగా మార్చుకోగల తెలివైన కంటెస్టెంట్ గా శివాజీ కి ఈ బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు 7 సీజన్లు వచ్చాయి. ఈ ౭ సీజన్స్ మొత్తం కలిపినా కూడా శివాజీ ని మించిన తెలివైన వాడు, మాటకారి తత్త్వం ఉన్నవాడు, ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

మొట్టమొదటిసారి ఒక కంటెస్టెంట్ ని చూసి హోస్ట్ నాగార్జున సైతం భయపడిపోవడం ఈ సీజన్ లోనే మనం చూసాము. శివాజీ తప్పులు చేసినప్పటికీ కూడా ‘ఆమ్మో..ఇతనితో పెట్టుకోవడం మనకి ఎందుకులే..మనకే రివర్స్ లో కొడుతాడు’ అనే భావన నాగార్జున లో కలగడం వల్లే శివాజీని ఆయన ఎక్కువగా టార్గెట్ చెయ్యలేదు అనేది నెటిజెన్స్ అభిప్రాయం. ఒకవేళ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో గత వారం లో జరిగిన సంఘటన మనమంతా చూసాము.

Shivaji

శోభా శెట్టి విషయం లో తప్పుడు మాటలు తూలడం, దానిని నాగార్జున నిలదీయడం, నాగార్జున కి ధీటుగా శివాజీ సమాధానం చెప్పడం, ఇవన్నీ కోట్లాది మంది తెలుగు ప్రజలు చూసారు. కొంతమంది శివాజీ ని సమర్దిస్తే, మరికొంత మంది ఆడపిల్లలపై అలాంటి కామెంట్స్ చెయ్యడం ఏమిటి అని తిడుతున్నారు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ సినిమాల ద్వారా సంపాదించుకున్న ఫ్యాన్స్ కంటే, బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న ఫ్యాన్స్ ఎక్కువ.

- Advertisement -
Bigg boss Telugu Shivaji

ఇకపోతే శివాజీ కి టైటిల్ కొట్టేంత అభిమానులు ఉన్నారు, అలాగే ఆయనకంటూ ఒక పెద్ద పీఆర్ టీం కూడా ఉంది. శివాజీ కి ఓట్లు వెయ్యాలి అంటూ పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. శివాజితో పాటుగా పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ లకు కూడా సమానంగా టైటిల్ ని గెలిచే సత్తా ఉంది..ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here