Pavitra Lokesh : ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్రా లోకేష్..టాలివుడ్ హీరో నరేష్ తో సహజీవనం చేస్తుందన్న విషయం తెలిసిందే..ఈ మధ్య ఈ ఇద్దరూ పబ్లిక్ గా తిరుగుతూ రెచ్చిపోతున్నారు..వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇద్దరూ కలిసి కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి అయితే చేసుకోలేదు కానీ.. ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు సమాచారం. అవన్నీ పక్కన పెడితే.. అసలు నరేష్ వల్లనే పవిత్రా లోకేశ్ కు చాలా పేరు వచ్చింది. తను తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ తనకు ఇంత పేరు అయితే రాలేదు. అయితే.. నరేష్ తో పరిచయం పెంచుకున్నప్పటి నుంచి..
నరేష్ తో పాటు తను కూడా ట్రెండ్ అవుతుండటంతో అందరూ తన గురించి వెతకడం ప్రారంభించారు. దీంతో గూగుల్ లో తనే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మీడియా కూడా పవిత్రా లోకేష్ పై ఫోకస్ పెంచింది. అయితే.. పవిత్రది కర్ణాటక. తన తండ్రి కన్నడ నటుడు. అందుకే.. తనకు కూడా చిన్నప్పటి నుంచి సినిమా రంగం మీద ఆసక్తి ఏర్పడింది. తన తండ్రి చనిపోయిన తర్వాత పొట్టకూటి కోసం పలు సినిమాల్లో నటించింది.. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యిందట..
1994 లోనే అంబరీష్ హీరోగా వచ్చిన మిస్టర్ అభిషేక్ అనే సినిమాలో నటించింది. కొన్నేళ్ల పాటు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. సినిమాల్లో బిజీ అయిపోగానే సివిల్స్ ను వదిలేసింది. కన్నడ, తెలుగులో మంచి ఆఫర్స్ రావడంతో సినిమాలు చేస్తూ వెళ్లిపోయింది. పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్.. టీవీ సీరియల్ నటుడు. ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంథకన్నా ముందే పవిత్రకు ఒక పెళ్లయి విడాకులు తీసుకుంది. సుచేంద్రతోనూ గొడవలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉన్నారు.. ఇప్పుడు నరేష్ తో పెళ్ళికి రెడీ అయ్యింది..మూడు పెళ్ళిళ్ళు నరేష్ చేసుకున్న విషయం తెలిసిందే..ఇక ఈమె చేసుకోవడం లో తప్పు లేదులే.. అని గాసిప్ రాయిళ్ళు తెగ హైలెట్ చేస్తున్నారు..ఏది ఏమైనా వీరిద్దరు ఇప్పుడు ట్రెండ్ లో ఉంటున్నారు.. విమర్శలు ఎదురవుతున్నా కూడా లెక్క చెయ్యడం లేదు..మరి వీర్రిద్దరు ఎప్పుడూ పెళ్ళి చేసుకుంటారో చూడాలి..