Mega Star Chiranjeevi : వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నీ డైరక్టర్ బాబీ తెరకెక్కించారు. జనవరి 13 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్ లో సందడి చేయనుంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో పోలీస్ కమిషనర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ పాటలు విడుదల అయి ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్న చిరంజీవి వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్తా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి గతంలో తనపై జరిగిన విష ప్రయోగం గురించి మాట్లాడారు. ఇంతకీ చిరుపై విష ప్రయోగం ఎప్పుడు జరిగింది.. ఎవరు చేశారు.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
“నాపై విషయం ప్రయోగం జరిగిందనేది నిజమే. మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పట్లో ఓ పిచ్చి అభిమాని చేసిన పని ఇది. హార్స్ క్లబ్లో షూటింగ్ జరుగుతుంది.. ఫైట్స్ సీన్స్ షూట్ చేస్తున్నాడు. అప్పుడు ఫ్యాన్స్ చాలామంది నన్ను చూడ్డానికి వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ వచ్చిన నన్ను కేక్ కట్ చేయమన్నారు చేశాను.”
“అప్పుడు ఓ అభిమాని.. కేక్ కట్ చేసి చేత్తో నా నోట్లో పెట్టబోయాడు. అలా చేత్తో పట్టుకుని పెడితే నాకు ఇష్టం ఉండదు. వద్దు వద్దు అంటుంటే వాడు బలవంతంగా నా నోట్లో కేక్ పెట్టేశాడు. అయితే ఆ కేక్ తింటున్నప్పుడు కాస్త చేదుగా అనిపించింది. పరీక్షించి చూస్తే.. ఆకేక్లో ఏదో ఎక్స్ ట్రా పౌడర్ మధ్యలో పెట్టినట్టు అనిపించింది.ఇదేంటి ఇది.. తేడాగా ఉంది అని మా వాళ్లు వాడ్ని పట్టుకుని అడిగితే.. ఏం లేదు.. ఏం లేదు అని అన్నాడు. కానీ మా వాళ్లు వదల్లేదు.. ఆ కేక్‌ని టెస్ట్‌లకు పంపించారు అప్పుడు అసలు నిజం తెలిసింది. కేక్‌లో వాడిన పౌడర్‌లో పాయిజన్ వాడారని రిపోర్ట్ వచ్చింది. వెంటనే నిర్మాత కేఎస్ రామారావు గారు వాడ్ని కొట్టేశారు.”
“ఎందుకు ఇలా చేశావ్ రా అంటే.. చిరంజీవి గారు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు. వేరే వాళ్లతో ఇంట్రాక్ట్ కావడం నచ్చలేదు. ఆయనకి దగ్గరవ్వాలనే ఇలా చేశాను. కేరళలో వశీకరణ మందు తీసుకొచ్చి కేక్‌లో కలిపాను అని చెప్పాడు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు.. సర్లే అని వదిలేశా. విష ప్రయోగం అదీ అదీ అని వద్దులే అని అని చెప్పా. పాపం వాడిది.. అభిమానం అనుకోవాలో.. మూర్ఖత్వం అనుకోవాలో.. వాడు మాత్రం అభిమానంతోనే అలా చేశాడు. వశీకరణ మందు కలిపితే.. వాడ్ని పట్టించుకుంటాని అలా చేశాడన్నాడు. అలాంటి వాడ్ని ఏం చేస్తాం నవ్వి ఊరుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.