Keerthy Bhatt : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తరుపున ఎవరైనా సెలెబ్రిటీలు స్టాండ్ తీసుకోవడానికి భయపడిపోతున్నారు. ముఖ్యంగా టాప్ 3 కంటెస్టెంట్స్ గా పిలవబడే అమర్ దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే చాలు వెంటనే కామెంట్ సెక్షన్ లో నెగటివ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఉదాహరణకి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ ఎవరైనా పోస్టులు పెడితే పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ ఫ్యాన్స్ దాడికి దిగుతున్నారు.
అలాగే ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే అమర్ దీప్ ఫ్యాన్స్ నుండి కూడా ఇలాగే నెగటివిటీ ఉంటుంది. వీళ్ళు కాకుండా సోషల్ మీడియా లో గౌతమ్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఎలాంటి గ్రూప్ లోకి దూరకుండా సొంత గేమ్ ఆడుతూ వచ్చాడు కాబట్టి. అలా వచ్చాడని బిగ్ బాస్ సీజన్ 6 టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరైన కీర్తి భట్ గౌతమ్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టింది.
దీంతో పల్లవి ప్రశాంత్, అమర్ మరియు శివాజీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కీర్తి భట్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తూ చాలా అసభ్యంగా మాట్లాడారు. ఇన్ని ఏళ్ళ బిగ్ బాస్ సీజన్స్ లో ఎప్పుడు కూడా ఇంత నెగటివిటీ లేదు. ఈ నెగటివ్ కామెంట్స్ ని చూసి కీర్తి భట్ చాలా ఎమోషనల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ ఒకరికి ఎదో ఒక కంటెస్టెంట్ నచ్చొచ్చు, వాళ్ళ గురించి మాట్లాడొచ్చు,ఆ స్వేచ్ఛ ఉంటుంది. నేను గౌతమ్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టగానే కొంతమంది వచ్చి అసహ్యంగా నాపై కామెంట్స్ చేసారు. మెయిల్ బాక్స్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది. నేను ఈ సీజన్ లో నాకు నచ్చిన హౌస్ మేట్స్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎలాంటి గ్రూప్ గేమ్ ఆడకుండా సొంత ఆడిన వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేశాను, గౌతమ్ ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే సపోర్ట్ చేశా, అందుకు నన్ను ఇంతలా తిడుతారా?, ఇంకోసారి నెగటివ్ కామెంట్స్ చేస్తే మీ ఇంట్లో మీ అమ్మ తోనే కొట్టిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్.