Pallavi Prashanth : టైటిల్ గెలిచిన తర్వాత వచ్చే 50 లక్షల ప్రైజ్ మనీ మొత్తం వాళ్లకి ఇచ్చేస్తాను అంటూ ప్రకటించిన పల్లవి ప్రశాంత్!

- Advertisement -

Pallavi Prashanth : ఈ సీజన్ బిగ్ బాస్ షో చివరి దశకి చేరుకుంది. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అనే చెప్పాలి. బిగ్ బాస్ నిర్వాహకులకు అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ అయ్యినందుకు ఎంతో సంతోషం గా ఉన్నారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అందరికీ ముందు అనుకున్న రెమ్యూనరేషన్స్ కంటే ఎక్కువే ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

Pallavi Prashanth
Pallavi Prashanth

ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ ఎలిమినేట్ అవ్వగా, అమర్ దీప్, శివాజీ, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్, యావర్ మరియు పల్లవి ప్రశాంత్ మిగిలారు. వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సీజన్ 7 నడుస్తుంది కాబట్టి, మిగిలి ఉన్న 7 మంది కంటెస్టెంట్స్ ఫినాలే కి వెళ్లొచ్చు అని, వచ్చే వారం అసలు ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు. టికెట్ టు ఫినాలే గెలిచి అర్జున్ అంబటి మొట్టమొదటి ఫైనలిస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

Gautam

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టైటిల్ ని గెలిచిన కంటెస్టెంట్ కి 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ మరియు జాయ్ అలుకాస్ వారు అందించే 20 లక్షల రూపాయలతో పాటుగా ఒక కార్ కూడా బహుమతిగా వస్తుంది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఈ ప్రైజ్ మనీ గురించి కంటెస్టెంట్స్ కి వివరిస్తాడు. అయితే ఈ ప్రైజ్ మనీ తో ఏమి చేస్తారని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ అడగగా, పల్లవి ప్రశాంత్ వంతు వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

- Advertisement -
Pallavi Prashanth

తనకి వచ్చిన 50 లక్షల రూపాయిలు మొత్తాన్ని చనిపోయిన రైతు కుటుంబాలకు ఇచ్చేస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీనికి హౌస్ మేట్స్ తో పాటుగా నాగార్జున నుండి కూడా క్లాప్స్ వచ్చాయి. ప్రస్తుతానికి టైటిల్ విన్నింగ్ రేస్ పల్లవి ప్రశాంత్ మరియు అమర్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here