Bigg Boss Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాస్కులు ఆడడం లో కానీ, గేమ్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం లో కానీ, అర్జున్ ని మించిన జీనియస్ ఎవ్వరూ లేరని చెప్పొచ్చు. ఈ సీజన్ మొత్తం మీద ది బెస్ట్ టాస్క్ ప్లేయర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అర్జున్ పేరు చెప్పేయొచ్చు ఎవరైనా. గేమ్స్ బాగా ఆడుతాడు కానీ, అదే విధంగా ఆయన హౌస్ లో తన క్యారక్టర్ ని కూడా కాపాడుకొని ఉంటే కప్ ఆయనకీ చేతిలో పెట్టేసి ఉండొచ్చు.
కానీ అర్జున్ అక్కడ ఫెయిల్ అయ్యాడు. అర్జున్ బయట అమర్ దీప్ కి ఎంతో మంచి స్నేహితుడు. ఆయన హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే అమర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నయ్యా అని కౌగలించుకుంటాడు. అప్పుడు అర్జున్ నుండి రెస్పాన్స్ ఏమి ఉండదు, అప్పుడే అందరికీ అర్థం అయ్యింది, ఏంటి మనోడు కొద్దిగా తేడాగా ఉన్నాడే అని.
ఆ తర్వాత కూడా ఆయన అమర్ ని దూరం పెట్టడం, శివాజీ బ్యాచ్ తో కలిసి జోక్స్ వెయ్యడం చూసినప్పుడే జనాల్లో అర్జున్ క్యారక్టర్ మీద ఉన్న ఒపీనియన్ పోయింది. అయితే హౌస్ లో ఆయన శివాజీ మరియు గౌతమ్ తో చాలా స్నేహం గా ఉంటూ రావడం మొదలెట్టాడు. కానీ నిన్న అమర్ దీప్ ని కెప్టెన్ చేసే విషయం లో శివాజీ అర్జున్ కి సపోర్టుగా నిలిచి పోరాడడం, ఆ తర్వాత అర్జున్ మా భార్య ప్రెగ్నన్సీ విషయాన్నీ తీసుకొని రావడం నాకు నచ్చలేదని శివాజీ ని నామినేట్ చెయ్యడం తో అర్జున్ తన గొయ్య తానే తవ్వుకున్నట్టు అయ్యింది.
శివాజీ అయితే అర్జున్ పొడిచిన వెన్నుపోటు కి ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. దీంతో శివాజీ మరియు అతని గ్యాంగ్ అర్జున్ తో మాట్లాడడం మానేసాడు. ఈ రోజు టాస్కులలో అర్జున్ ఎక్కువగా గెలిచాడు. కానీ అతని ఆనందాన్ని ఎవ్వరూ పంచుకోలేదు. చివరికి ఎవరిని అయితే దూరం పెడుతూ వచ్చాడో, అదే అమర్ తో కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది కూడా అర్జున్ అట. గేమ్స్ ఆడడం మాత్రమే కాదు, ప్రవర్తన కూడా చాలా ముఖ్యం అని అర్జున్ ని చూసినప్పుడే అర్థం అయ్యింది.