Aadikeshava : ‘ఉప్పెన’ సినిమాతో సుమారుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టి ఇండియా లోనే ఏ డెబ్యూ హీరో కి సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ని చూసి అందరూ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.
అయితే కమర్షియల్ మాస్ హీరో ఇమేజి కోసం పాకులాడుతూ ఆయన చేసిన రీసెంట్ చిత్రం ‘ఆది కేశవ‘ కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీలీల ని హీరోయిన్ గా పెట్టుకొని ఆమె చేత మాస్ డ్యాన్స్ ఉన్న సాంగ్ ని కూడా పెట్టారు. ఇలా ఫక్తు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది.
ఈ సినిమాని కొన్న బయ్యర్స్, మాస్ సినిమా కదా కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయని అనుకున్నారు. కానీ నాలుగు రోజులకే షేర్ వసూళ్లు ఆగిపోయ్యే రేంజ్ డిజాస్టర్ అవుతుందని మాత్రం ఊహించలేకపోయారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
అలా వీకెండ్ మొత్తం కలిపి ఈ సినిమాకి కేవలం 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక నాల్గవ రోజు అయితే కేవలం 14 లక్షలు మాత్రమే వచ్చింది. అలా ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కోటి 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చులు కూడా రాలేదు అన్నమాట. ప్రింట్ కాస్ట్ మరియు పబ్లిసిటీ మెటీరియల్ కలిపి రెండు కోట్లు ఖర్చు అయ్యింది. కనీసం అది కూడా రికవర్ చేయలేకపోవడం బాధాకరం.