Sandeep Vanga : చిరంజీవి సినిమాకి రీమేక్ గా ‘ఎనిమల్’..? పొరపాటున నోరు జారేసిన డైరెక్టర్ సందీప్ వంగ!

- Advertisement -

Sandeep Vanga : బాలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఎనిమల్’. రణబీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాకి ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Sandeep Vanga
Sandeep Vanga

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు మరియు రాజమౌళి ముఖ్య అతిథులుగా రావడం తో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగింది. కచ్చితంగా మరో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం రాబోతుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా వచ్చిందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి డైరెక్టర్ సందీప్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Ranbir Kapoor

అదేమిటంటే ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన పాత సూపర్ హిట్ చిత్రం ‘కిరాతకుడు’ కథ కి పోలి ఉంటుందట. సందీప్ వంగ ఈ చిత్రాన్ని ఆ సినిమా ఆధారంగా తీసుకొనే తెరకెక్కించాను అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నోరు జారాడు. కానీ టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే మాత్రం ఆ సినిమాకి పూర్తిగా బిన్నంగా ఉంటుందట. రణబీర్ కపూర్ క్యారక్టర్ ని కూడా చాలా కొత్తగా చూపించాడట.

- Advertisement -
Amimal Movie

ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అని అంటున్నాడు సందీప్. ఇప్పటి వరకు ఎవరైనా కిరాతకుడు మూవీ చూడకుండా ఉంటే ఒకసారి యూట్యూబ్ లో ఉంటుంది చూసేయండి. కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించాడట. మరి ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here