Amardeep : ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయిన అమర్ దీప్.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

- Advertisement -

Amardeep : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అమర్ దీప్ గ్రాఫ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వారం ఓటింగ్స్ లో అమర్ దీప్ అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు. హౌస్ లోకి అమర్ అడుగుపెట్టిన కొత్తల్లో ఏమిటి ఈ అబ్బాయి ఇలా ఆడుతున్నాడు, బయట ఎలా ఉండేవాడు, ఇక్కడ ఇలా ఉన్నాడు ఏమిటి అని అందరూ అనుకున్నారు.

Amardeep
Amardeep

అంతే కాదు హౌస్ లోకి వచ్చినప్పటి అత్యధిక ఫౌల్ గేమ్స్ ఆడి నాగార్జున చేత తిట్లు తిన్న ఏకైక కంటెస్టెంట్ అమర్ మాత్రమే అని చెప్పొచ్చు. అయితే ఆ స్థాయి నుండి నేడు టైటిల్ విన్నింగ్ రేంజ్ కి ఎదిగాడంటే ఆయన ఆట తీరు ఏ స్థాయిలో డెవలప్ అయ్యిందో మనమంతా గమనించొచ్చు. ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ టాస్కు కి చివరి వారం అని చెప్పొచ్చు, అమర్ దీప్ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు.

Amardeep  Health

ఆయన అభిమానులు అమర్ కెప్టెన్ అవ్వడానికి ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే గత రెండు రోజుల నుండి అమర్ దీప్ కి ఆరోగ్యం బాగాలేదు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అమర్ దీప్ కి ఫిట్స్ వచ్చాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, టాస్కు ని మధ్యలో ఆపారని ఇలా చాలా వార్తలు వచ్చాయి. అయితే అవేమి టెలికాస్ట్ లో చూపించలేదు కానీ, అమర్ కి ఆరోగ్య పరిస్థితి బాగలేదు అనేది మాత్రం నిజమేనట.

- Advertisement -
Amardeep bigg boss

ఆయనతో కలిసి ‘జానకి కలగనలేదు’ లో నటించిన నరేష్ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. ‘అమర్ కి హౌస్ లో రీసెంట్ గానే బాగాలేకుండా వచ్చింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే అమర్ కి బాగాలేదు, సరైన డైట్ కచ్చితంగా తీసుకోవాలి, నిద్ర ఉండాలి, కానీ అమర్ బిగ్ బాస్ లో తీసుకుంటున్న ఆహరం అతనికి సరిపడడం లేదు, అందుకే ఫిట్స్ వచ్చాయి. తలో ఇంత ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఏ రోజు సానుభూతి కోసం అమర్ వాడుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి అమర్ ఆరోగ్యపరిస్థితి స్థిరంగానే ఉందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here