Bigg Boss Telugu లో హత్య.. అమర్ దీప్ మరియు అర్జున్ ని దాచేసిన బిగ్ బాస్!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి వారం నుండి నేటి వరకు ప్రతీ ఎపిసోడ్ లోని మంచి టాస్కులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ముందుకెళ్తుంది. మద్యమద్యలో ఎవ్వరూ ఊహించని ట్విస్టులతో థ్రిల్ కి కూడా గురి చేస్తుంది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంత వాడివేడి వాతావరణం మధ్య జరిగిందో మనమంతా చూసాము.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

కేవలం ప్రియాంక మరియు శోభా శెట్టి మినహా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం టాప్ 3 కంటెస్టెంట్స్ గా ఎవరైతే నిలుస్తారో వాళ్ళే ఈ సీజన్ కి దాదాపుగా టాప్ 3 అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇదంతా పక్కన పెడితే గత వారం యావర్ ఇచ్చేసిన ‘ఏవిక్షన్ పాస్’ కోసం ఈ వారం కూడా టాస్కులను నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి ‘ఏవిక్షన్ పాస్’ ని సొంతం చేసుకున్నాడు.

Pallavi Prashanth

ఈ టాస్కు తర్వాత బిగ్ బాస్ మరో ఆసక్తికరమైన టాస్కు ని ఏర్పాటు చేసాడు. అమర్ దీప్ మరియు అర్జున్ ని మినహా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ యాక్టివిటీ రూమ్ కి పిలుస్తారు. అక్కడ రుచికరమైన ఆహరం తో అందరికీ విందు ఇస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత హాల్ లోకి వచ్చాక అందరూ అమర్ దీప్ మరియు అర్జున్ కోసం వెతుకుతూ ఉంటారు.

- Advertisement -
shivaji

అప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతూ ‘మిస్ బిగ్ బాస్ ని హత్య చెయ్యబడింది’ అని హౌస్ మేట్స్ కి తెలియచేస్తాడు. అప్పుడు రహస్యం గా దాచిపెట్టిన అమర్ దీప్ మరియు అర్జున్ ని పోలీస్ గెటప్ లో హౌస్ లోకి పంపిస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత టాస్కు మొత్తం వినోదం ని పంచుతూ ఎంతో ఆసక్తికరంగా సాగింది. గడిచిన రెండు వారాల్లో ఇది ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచిన టాస్క్ అని చెప్పొచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here