Allu Sirish : గర్ల్ ఫ్రెండ్ లేదని తెగ వర్రీ అవుతున్న అల్లు శిరీష్.. నువ్వు అలాంటోడివి కాబట్టే లేరంటున్న నెటిజన్లు

- Advertisement -


Allu Sirish : అల్లు శిరీష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు. 2013లో గౌరవం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్క మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పడలేదు. దీంతో నటన పరంగా ఆయన పలు విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అల్లు శిరీష్ చివరిగా ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

Allu Sirish
Allu Sirish

ఈ సినిమాలో వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కుల పడినా.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అల్లు శిరీష్. ఐతే ఓవైపు మూవీస్‌ కోసం ట్రై చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటాడు. తన సినీ అప్డేట్స్ తో పాటు.. పర్సనల్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు జనాల కోసం షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుకల్లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ సందడి చేశారు.

Allu Sirish Photos

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ముగ్గురు యంగ్ హీరోస్ మ్యారేజ్ కు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ తన ఇన్ స్టా స్టోరీగా షేర్ చేసుకున్న ఒక్క వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫ‌న్నీ రీల్ షేర్ చేశాడు అల్లు శిరీష్. తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నరు. తను మాత్రం ఈ జిమ్లో ఐదు కేజీల డంబులు ఎత్తుకుని వాటితో వర్క్ అవుట్ చేస్తున్నాను అన్నట్లు ఓ వీడియోను షేర్ చేశాడు. తన జీవితం కూడా అలానే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here