Veerasimha Reddy : వీరసింహరెడ్డి లిరికల్ సాంగ్ రిలీజ్.. శ్రుతితో బాలయ్య ఊరమాస్ రొమాన్స్..

- Advertisement -

Veerasimha Reddy : సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది… ఈ సినిమాల నుంచి విడుదల అవుతున్న ఒక్కొక్కటి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా అంచనాలను క్రియేట్ చేస్తుంది.. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది.

Veerasimha Reddy
Veerasimha Reddy

ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ఆద్యంతం ఊరమాస్ లిరిక్స్‌తో దూసుకుపోగా, ఈ పాటను మనో, రమ్య బెహరా కలిసి పాడారు. ఇక ఈ పాటలో శ్రుతి హాసన్‌తో కలిసి బాలయ్య ఊరమాస్ రొమాన్స్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులు కూడా వేస్తున్నట్లు ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో చూపెట్టారు..

Actor Balakrishna
Actor Balakrishna

మొత్తానికి వీరసింహారెడ్డి సినిమాలోని అన్ని పాటలు కూడా మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విజిల్స్ వేసేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న వీరసింహారెడ్డి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here