Ram Charan : ఆ తేదీ లోపు షూటింగ్ పూర్తి చెయ్యకపోతే ఇక డేట్స్ ఇవ్వను అంటూ శంకర్ కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్!

- Advertisement -

మెగా పవర్ స్టార్ Ram Charan అభిమానులు తమ అభిమాన హీరో పట్ల చాలా అసంతృప్తి తో ఉన్నారు. #RRR చిత్రం తో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్లోబల్ స్టార్ ఇమేజి ని దక్కించుకున్న రామ్ చరణ్, ఆ చిత్రం తర్వాత నెల రోజుల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఆచార్య’ చిత్రం లో ముఖ్య పాత్ర ని పోషించాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

Ram Charan
Ram Charan

రామ్ చరణ్ పాత్రకి కూడా పెద్దగా పేరు రాలేదు. దీంతో అభిమానులు ఆయన నుండి అర్జెంట్ గా ఒక్క భారీ బ్లాక్ బస్టర్ ని ఆశిస్తున్నారు. అప్పుడెప్పుడో #RRR మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే శంకర్ తో ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రారంభించాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఈ ఏడాదికి పూర్తి అయిపోయి ఉండేది. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా అన్నీ భాషల్లో విడుదల అయ్యుండేది. కానీ మధ్యలో శంకర్ కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ చిత్రాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నెలలో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం పనిచేస్తే, మరో 15 రోజులు ఇండియన్ 2 కోసం పని చేసేవాడు. అందువల్ల ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.

- Advertisement -

అయితే రామ్ చరణ్ శంకర్ కి ఒక డెడ్ లైన్ పెట్టినట్టుగా ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ ఎండింగ్ లోపు మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని, అంతకు మించి పొడిగిస్తే డేట్స్ ఇవ్వడానికి నాకు చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే నా తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. మే నెల నుండి వాళ్లకి డేట్స్ ఇవ్వాలి అని శంకర్ తో అన్నాడట రామ్ చరణ్. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here