Upasana Konidela కి బాగా ఇష్టమైన టాలీవుడ్ హీరో అతనేనా..? రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్!

upasana


Upasana Konidela : టాలీవుడ్ లో అత్యధిక స్టార్ హీరోలు ఉన్న ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది మెగా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో ని ఇచ్చాడు. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లాంటి పాన్ వరల్డ్ స్టార్స్ ని ఇచ్చాడు.

Upasana Konidela
Upasana Konidela

వీరితో పాటుగా వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ వంటి మీడియం రేంజ్ హీరోలను ఇచ్చాడు. మన టాలీవుడ్ కి 50 శాతం కి పైగా బిజినెస్ కేవలం మెగా ఫ్యామిలీ నుండే వస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంత మంది స్టార్స్ ఉన్నపటికీ కూడా, బయట హీరోలను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కుటుంబం నుండి. అలాంటి వారిలో ఒకరు ఉపాసన.

Ram Charan Upasana Konidela

ఈమెకి తన మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు కాకుండా, బయట హీరోలలో విక్టరీ వెంకటేష్ అంటే చాలా ఇష్టమట. కాళీ సమయం లో ఆయన సినిమా టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా ఇంటి పనులు మానుకొని మరీ ఇప్పటికీ చూస్తుందట ఉపాసన. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

Venkatesh

వెంకటేష్ నటించిన సినిమాలలో ఆమెకి ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు అంటే చాలా బాగా ఇష్టమట. ఈ సినిమాలను ఆమె ఎన్ని సార్లు చూసిందో లెక్కనే లేదట. రీసెంట్ గా విడుదలైన సినిమాలలో ఆమెకి దృశ్యం చిత్రం బాగా ఇష్టమట. కేవలం ఉపాసన మాత్రమే కాదు, రామ్ చరణ్ కి కూడా విక్టరీ వెంకటేష్ సినిమాలు అంటే బాగా ఇష్టం. పలు ఇంటర్వూస్ లో ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు కూడా.

Tags: