Himaja : హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారంటూ ఓ వార్త వైరలవుతోంది. బిగ్ బాస్ ఫేం హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ప్రచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్ చట్టం కింద హిమజతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హిమజ సహా 11 మంది సినీతారలు, బిగ్‌బాస్ సెలబ్రిటీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దీనిపై నటి హిమజ స్పందించారు. పోలీసులు వచ్చి చెక్ చేశారని.. అంతే తప్ప తాను అరెస్ట్ కాలనేదని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని ఇన్ స్టాలో వీడియో రిలీజ్ చేశారు . తన కొత్తింట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నానని అంది. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నానని తెలిపింది హిమజ. ఎవరో.. ఏదో అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని.. పోలీసులు వచ్చి తన ఇంటిని సోదా చేశారని.. అందుకు సహకరించామని వీడియోలో తెలిపింది. పోలీసులు వాళ్ల డ్యూటీని చేశారని.. కానీ కొందరు దీపావళి పార్టీని రేవ్ పార్టీ అని తప్పుగా ప్రచారం చేశారని మండిపడింది.
తాను ఇంట్లోనే.. సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అరెస్టు అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అరెస్టయినట్లు వస్తున్న వార్తలో నిజం లేదని.. దయచేసి ఎవరూ ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని వీడియో రిలీజ్ చేసింది.