Bandla Ganesh : ఊరు మొత్తాన్ని తగలబెట్టడానికి సిద్దమైన బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

- Advertisement -

Bandla Ganesh : ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్ ఏమి చేసిన చాలా వెరైటీ గా ఉంటుంది. స్టేజి మీద మైక్ దొరికితే ఇతను ప్రపంచాన్నే మర్చిపోతాడు. ఎవరికైనా ఎలివేషన్స్ వేయాలంటే బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా, రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్ కూడా ఆ రేంజ్ ఎలివేషన్స్ వెయ్యలేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే పూనకాలు వచ్చి ఊగిపోతాడు.

Bandla Ganesh
Bandla Ganesh

వరుసగా సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోయిన బండ్ల గణేష్, ఈమధ్య కాలం లో ఎందుకో బాగా దూరం అయ్యాడు. బండ్ల గణేష్ కి డబ్బులు లేక సినిమాలు చెయ్యడం లేదో, లేకపోతే హీరోలు ఆయనకీ డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదో తెలియదు కానీ, బండ్ల గణేష్ మాత్రం నిర్మాతగా ఖాళీ గానే ఉన్నాడు. నటుడిగా ఈమధ్య కాలం లో రెండు మూడు సినిమాల్లో కనిపించాడు కానీ, రెగ్యులర్ గా మాత్రం వెండితెర మీద కనిపించడం లేదు.

Bandla Ganesh Photos

ఇదంతా పక్కన పెడితే దివాళీ కి బండ్ల గణేష్ వేసే పోస్టుల కోసం నెటిజెన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఊరు మొత్తం కాల్చే టపాకాయలను, ఆయన కేవలం తన ఇంట్లో కాల్చుకోడం కోసం తెచ్చుకుంటాడు. గతం లో ఆయన రకరకాల టపాకాయలు కొనుగోలు చేసి, స్టైల్ గా కూర్చొని ఫోజులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. మీమెర్స్ సందర్భానికి తగ్గట్టుగా ఈ ఫోటోని వాడుకునే వారు.

- Advertisement -
Bandla Ganesh Diwali

ఈరోజు కూడా మీమెర్స్ కి పండగ చేసుకునే రేంజ్ ఫోటో ని ఒకటి విడుదల చేస్తూ హ్యాపీ దీపావళి అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త తెగ వైరల్ అయ్యింది. ‘నేను ఈ ఏడాది వినాయక చవితి జరుపుకోలేదు, ఉగాది చేసుకోలేదు, కానీ దీపావళి మాత్రం ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నా’ అంటూ పోస్ట్ చేసాడు. దాని క్రింద కామెంట్స్ లో అన్ని టపాకాయలు ఏమి చేసుకుంటావు అన్నా, ఊరు మొత్తాన్ని కాల్చేయబోతున్నావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here