Balla Krishna : బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీర సింహారెడ్డి సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది..అయితే నిన్న ఒంగోలులో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపారు..ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్తో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సినిమాలో తాము బాలయ్య నుంచి ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే.. అందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్తో ఈ ట్రైలర్ ముగుస్తుంది.
అయితే ఈ డైలాగ్ పొలిటికల్గా హాట్ టాపిక్ అయ్యింది..ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్గానే బాలకృష్ణ ఈ డైలాగ్ చెప్పినట్టు ప్రచారం మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పథకాలకు పేర్లు మార్చింది. వాటికి వైఎస్ఆర్ పేర్లు పెట్టింది. అయితే రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పెద్ద రచ్చ అయ్యింది. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది..ఇక చేసేదేమి లేక పోవడంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాక చూసుకుంటాము అని సైలెంట్ అయ్యారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టేలా వీరసింహారెడ్డిలో బాలకృష్ణ డైలాగ్ ఉందనే చర్చ జరుగుతోంది. సినిమాలో సీన్లకు తగ్గట్టుగానే ఈ డైలాగ్ ఉండొచ్చు కానీ.. దీని అసలు ఉద్దేశ్యం మాత్రం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై సెటైర్లు వేయడమే కావొచ్చనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో కొనసాగుతున్న రాజకీయ వైరానికి వీరసింహారెడ్డిలో బాలయ్య డ్తెలాగు ఆద్యం పొస్తుందని తెలుస్తుంది..చూడాలి ఇక ఎంత వరకూ ఇది వెళ్తుందో..