Varun Tej – Lavanya : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటలలో ఒకటి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట. ‘మిస్టర్ అనే సినిమాతో ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత స్నేహం గా మారి అంతరిక్షం సినిమా సమయానికి ప్రేమగా మారింది. వీళ్ళు చాలా కాలం నుండి డేటింగ్ లో ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి కానీ, అందులో ఎలాంటి నిజం లేదని లావణ్య త్రిపాఠి అనేక సందర్భాలలో కొట్టి పారేసింది. కానీ ఒక్కసారిగా వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరుపుకొని అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ట్విస్ట్ ఇచ్చింది.
నవంబర్ 1 వ తారీఖున వీళ్లిద్దరు ఇటలీ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి మెగా కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు హాజరు అవ్వబోతున్నారు. ప్రైవసీ ని ఎక్కువగా ఇష్టపడే వరుణ్ తేజ్, ఇక్కడి మీడియా కి దూరం గా ఉండేందుకే ఈ వివాహం ని దేశం కానీ దేశం లో చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా పెద్ద కోటీశ్వరుల పెళ్ళికి సంబంధించి ప్రతీ విషయం ఎంతో రిచ్ గా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. అలా వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆహ్వాన పత్రిక విలువ దాదాపుగా ఆరు లక్షల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ప్రత్యేకమైన డిజైన్స్ తో ఈ ఆహ్వాన పత్రికని స్పెషల్ గా తయారు చేయించారట.
సోషల్ మీడియా లో ఈ వెడ్డింగ్ కార్డు ని వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి షేర్ చేసారు. ఆరు లక్షల రూపాయిలు కేవలం వెడ్డింగ్ కార్డు కోసం అనేది సాధారమైన విషయం కాదు. ఆ ఆరు లక్షలకు ఒక మధ్య తరగతి కుటుంబీకుడు తమ కూతురుకి పెళ్లి చెయ్యగలడు. పెద్దింటి పెళ్లిళ్లు అంటే ఈ రేంజ్ లో ఉంటాయి మరి.